Share News

kumaram bheem asifabad- అంగన్‌వాడీల భర్తీ ఎప్పుడో..?

ABN , Publish Date - Sep 13 , 2025 | 11:25 PM

మహి ళా, శిశు సంరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్‌, ఆయా పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఆయా కేంద్రాల పరిధిలో బాలిం తలు, గర్భిణులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నా రు. టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణ బాధ్యతను పక్క కేంద్రాల టీచర్లకు అప్ప గించడంతో వారిపై అదనపు భారం పడుతోంది. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలు సమస్యలకు నిల యంగా మారాయి.

kumaram bheem asifabad- అంగన్‌వాడీల భర్తీ ఎప్పుడో..?
బెజ్జూరు మండలంలోని కొత్తగూడ అంగన్‌వాడీ కేంద్రం

- ఇబ్బందులు పడుతున్న బాలింతలు, గర్భిణులు, పిల్లలు

- కొన్ని కేంద్రాల బాధ్యతలు ఇన్‌చార్జిలకు..

- అదనపు భారంతో సిబ్బందికి అవస్థలు

బెజ్జూరు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మహి ళా, శిశు సంరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్‌, ఆయా పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఆయా కేంద్రాల పరిధిలో బాలిం తలు, గర్భిణులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నా రు. టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణ బాధ్యతను పక్క కేంద్రాల టీచర్లకు అప్ప గించడంతో వారిపై అదనపు భారం పడుతోంది. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలు సమస్యలకు నిల యంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా ఆసిఫాబాద్‌, జైనూరు, వాంకిడి, సిర్పూర్‌, కాగజ్‌నగర్‌లో ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 973అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 165టీచర్‌, 447ఆ యాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూలై నెలలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. దీంతో నిరుద్యోగ మహిళ ల్లో ఆశలు చిగురించాయి. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తే అటు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే వారికి మేలు జరగడమే కాకుండా ఇటు నిరుద్యో గులకు సైతం ఉపాధి కల్పించినట్లు అవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.

- ఐసీడీఎస్‌ పరిధిలో..

ఐసీడీఎస్‌లో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలదే క్షేత్రస్థాయిలో కీలకపాత్ర. ఓ వైపు స్వంత అంగ న్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు పలు రకాల సేవలు అందిస్తూ, వైద్య ఆరోగ్య శాఖలో చేపట్టే కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. బూత్‌ లెవల్‌ అధికారులుగా ఎన్నికల విధుల్లో సేవలు అందిస్తు న్నారు. ఖాళీలు భర్తీ అయితే ప్రస్తుతం ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు పని భారం తగ్గ డంతో పాటు కేంద్రాలలో గర్భిణులు, బాలింతలకు, చిన్నారులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుంది. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 0-6 నెలల శిశువులు3,457, 7నెలల నుంచి 3ఏళ్ల పిల్లలు 20,357, 3-7ఏళ్ల పిల్లలు 20,100 మంది ఉన్నారు. గర్భిణులు 4,635, బాలింతలు 3,422మంది ఉన్నారు.

- జిల్లాలో 973అంగన్‌వాడీ కేంద్రాలు..

ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిదిలో మొత్తం 973 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. జిల్లా వ్యా ప్తంగా 165టీచర్‌, 447ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈనేపథ్యంలో సిబ్బంది కొరత ఉన్న కేం ద్రాల్లో ఇన్‌చార్జ్జిలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నా రు. దీంతో గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు సరైన సేవలు అందడం లేదు. ఇప్పటికే రాష్ట్ర మం త్రి భర్తీపై ప్రకటన చేసిన నేపథ్యంలో నిరుద్యోగ మహిళల్లో ఆశలు రేకెత్తించాయి. జిల్లాలోని ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌, ఆయా పోస్టులను భర్తీ చేస్తేనే అంగన్‌వాడీ కేంద్రాలు బలోపేతమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న పోస్టు లను భర్తీ చేస్తామని మంత్రి ప్రకటించి మూడు నెలలు కావస్తున్నా ఇప్పటికీ దీని ఫైలు కదలిక లేకపోవడంతో నిరుద్యోగ మహిళల్లో ఆందోళన మొదలైంది. ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని ప్రక టించి మూడు నెలలు కావస్తోంది. అయితే అధికా ర వర్గాల నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేకపో వడంతో నిరుద్యోగుల ఆశలు నెరవేరేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి జిల్లాలోని ఖాళీగా ఉన్న అంగన్‌ వాడీ కేంద్రాల్లోని పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగ మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రభుత్వానికి నివేదించాం..

- ఆడెపు భాస్కర్‌, జిల్లా సంక్షేమ అధికారి, ఆసిఫాబాద్‌

జిల్లాలోని ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌, ఆయాల పోస్టుల భర్తీ కోసం గతంలోనే ప్రభుత్వా నికి నివేదించాం. జిల్లాలో టీచర్‌, ఆయాల పోస్టులు 612వరకు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలోని ఖాళీల వివరాలు సేకరించి నివేదించాం. ప్రభుత్వం అనుమతిస్తే భర్తీకి చర్యలు తీసుకుంటాం.

Updated Date - Sep 13 , 2025 | 11:25 PM