Share News

నిందితులను ఇంకెప్పుడు అరెస్టు చేస్తారు..

ABN , Publish Date - Oct 16 , 2025 | 10:56 PM

వేమనపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధూకర్‌ ఆత్మహత్యకు కారుకులైన నిందితులను ఇంకెప్పుడు అరెస్టు చేస్తారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ ప్రశ్నించారు. చెన్నూరులో గురువారం నిర్వహించిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే నిందితులు స్వేచ్ఛగా తిరుతున్నారన్నారు.

నిందితులను ఇంకెప్పుడు అరెస్టు చేస్తారు..
మాట్లాడుతున్న వెంటేశ్వర్‌గౌడ్‌

బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌ గౌడ్‌

చెన్నూరు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) వేమనపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధూకర్‌ ఆత్మహత్యకు కారుకులైన నిందితులను ఇంకెప్పుడు అరెస్టు చేస్తారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ ప్రశ్నించారు. చెన్నూరులో గురువారం నిర్వహించిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే నిందితులు స్వేచ్ఛగా తిరుతున్నారన్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కాబట్టే నిందితులపై ఇప్పటికి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. నీల్వాయి ఎస్సై కోటేశ్వర్‌ రావు నిందితుల్లో ఒకరికి చుట్టం కావడం వల్లే కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సంఘటన సరిగి వారం రోజులు దాటినప్పటికి ఏ ఒక్క నిందితుడిని అదులోకి తీసుకోక పోవడానికి గల కారణాన్ని పోలీసులు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్‌, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రాంచంద్రరావులు బాదిత కుటుంబాన్ని పరామర్శించి నిందితులనె వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేసినప్పటికి పోలీసుల్లో కదలికరావడం లేదన్నారు. రాష్ట్ర ఉపాధ్యకకరక్షులు రఘు నాథరావు జిల్లాకు వచ్చిన అనంతరం తదుపరి కార్యచరణ ప్రకటిస్తామన్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు ఉన్నారు.

Updated Date - Oct 16 , 2025 | 10:56 PM