సీఎంఆర్ రికవరీ ఎప్పుడు..?
ABN , Publish Date - Jun 27 , 2025 | 01:07 AM
ప్రభుత్వం అందజేసిన ధాన్యాన్ని మరాడించి బియ్యంగా మార్చి తిరిగి అప్పగించడంలో రైస్ మిల్లర్లు తీవ్ర నిర్లక్ష్య ధోర ణి అవలంభిస్తున్నారు. నిర్ణీత గడువు ముగిసినప్పటికీ లక్ష్యం మేరకు సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇవ్వని మిల్లులపై చర్యలకు అధికార యంత్రాంగం సన్నద్ధం అవుతోంది.
-జిల్లాలో రూ. కోట్లలో పేరుకు పోయిన బకాయిలు
-రైస్ మిల్లర్లపై అధికారులు సీరియస్
-ఆర్‌ఆర్ చట్టం అమలు చేసినా ఫలితం శూన్యం
-కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తుకూ సన్నాహాలు
మంచిర్యాల, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అందజేసిన ధాన్యాన్ని మరాడించి బియ్యంగా మార్చి తిరిగి అప్పగించడంలో రైస్ మిల్లర్లు తీవ్ర నిర్లక్ష్య ధోర ణి అవలంభిస్తున్నారు. నిర్ణీత గడువు ముగిసినప్పటికీ లక్ష్యం మేరకు సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇవ్వని మిల్లులపై చర్యలకు అధికార యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. ఆయా సీజన్లలో పౌరసరఫరాల శాఖ అధ్వ ర్యంలో ధాన్యం కేటాయించిన మిల్లులు సకాలంలో బి య్యం అందించాలని మిల్లర్లకు ఆదేశాలు ఇస్తున్నా ప ట్టించుకోకపోవడంతో కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. గత సెప్టెంబరు 30 లోపు బియ్యం అప్పగిం చాలని ప్రభుత్వం హెచ్చరించినా మిల్లర్ల నుంచి స్పం దన రాలేదు. కడపటి సంవత్సరం వానాకాలం సీజన్‌కు సంబంధించి ఖచ్చితంగా మిల్లర్ల నుంచి బియ్యం తీసు కోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నుంచి జిల్లా అధి కారులకు ఆదేశాలు ఉన్నాయి. చాలా మంది మిల్లర్లు పలు కారణాలు చెబుతూ దాటవేసే ప్రయత్నం చేయ డంతో అధికారులు ప్రత్యక్ష చర్యలకు పూనుకున్నారు.
సీజన్ల వారీగా మిల్లర్లకు కేటాయించిన ధాన్యం, తిరిగి ఇవ్వాల్సిన బియ్యం వివరాలు మెట్రిక్ టన్నుల్లో....
సంవత్సరం సీజన్ ధాన్యం ఇవ్వాల్సిన బియ్యం పెండింగ్
2022-23 ఖరీఫ్ 40470.78 7308.583 2217.552
2022-23 రబీ 92169 26449 6716
2023-24 ఖరీఫ్ 139664 94057 39473
2023-24 రబీ 85266.520 57748 33600
ధాన్యం పక్కదారి...
జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లులకు అప్పగించిన ధా న్యం పక్కదారి పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ధాన్యాన్ని బియ్యంగా మార్చి బహిరంగ మార్కెట్లో వి క్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సీ ఎంఆర్ ఇచ్చే సమయంలో రేషన్ బియ్యాన్నే కొనుగోలు చేసి, తిరిగి అప్పగిస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నా యి. తనిఖీలో సమయంలో నిల్వలు చూపించాల్సి రావ డంతో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ సీఎంఆర్‌గా చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎఫ్‌సీఐ అధికారులు పరి శీలన సమయంలోనూ లెక్కలు చూపించకుండా త ప్పించుకున్న మిల్లర్లు ఉన్నారు. గతంలో కొన్ని మిల్లుల్లో రేషన్ బియ్యం పట్టుబడటమే దీనికి నిదర్శనం. అలాగే ఒక్కొక్కరికి రెండేసి చొప్పున మిల్లులు ఉండగా, కొన్నే ళ్లు ప్రభుత్వం ఇచ్చే ధాన్యంతో కోట్లకు పడగలెత్తుతు న్నారు. వీటన్నింటి పైనా విచారణ జరిపేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధపడుతోంది.
కేసులు నమోదవుతున్నా మారని తీరు...
సీఎంఆర్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్న మిల్లర్లపై జరిమానాలు, కేసులు విధిస్తున్నా వారి తీరు మారడం లేదు. ప్రతీ సీజన్‌లో ప్రభుత్వమే రైతుల నుంచి మ ద్దతు ధరతో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేక రణ జరుపుతోంది. ఈ ధాన్యాన్ని జిల్లాలో ఉన్న మి ల్లు లకు కేటాయిస్తే మిల్లర్లు సీఎంఆర్ చేసి తిరిగి అం దించాలి. బియ్యాన్ని ఎఫ్‌సీఐ నుంచి రాష్ట్ర పౌరస రఫ రాల శాఖకు అప్పగిస్తే రేషన్ షాపుల్లో లబ్దిదారులకు పంపిణీ చేస్తారు. అయితే ధాన్యం తీసుకుంటున్న మి ల్లర్లు బియ్యం మాత్రం ఇవ్వడం లేదు. ఈ క్రమంలో మిల్లర్లపై క్రిమినల్ కేసుల నమోదు, రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్) చట్టం అమలు చేశారు. జిల్లాలో సీఎంఆర్ బకాయిలు రూ. 130 కోట్ల పై చిలుకు ఉండగా, ఇప్పటి వరకు 20 మందికి పైగా రైస్ మిల్లర్లపై కేసులు నమో దయ్యాయి. 2021-22లో యాసంగి ధాన్యం సీఎంఆర్ ఇవ్వకుండా అలసత్వం వహించిన 19 మిల్లులకు రూ. 51 కోట్లు జరిమానా విధించారు. మళ్లీ 2022-23లో ఖరీ ఫ్ సీజన్‌కు చెందిన సీఎంఆర్ సకాలంలో అప్పగించని 20 మంది మిల్లర్లపై కేసులు నమోదయ్యాయి. 2023- 34 రబీ, వానాకాలం సీజన్లకు సంబంధించి సంబంధిం చి 42 శాతమే బియ్యం అప్పగించారు. బియ్యం ఇవ్వ ని మిల్లులకు జరిమానా, వడ్డీ కలిపి చెల్లించాలంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో దాన్యం విలువకు వడ్డీతో సహా లెక్కలు గట్టి వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ చాలా మంది మిల్లర్లు మొండి కేస్తుండటంతో వారి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న స్థిరాస్థులను సైతం జప్తు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా 2023-24 రబీ సీజన్‌కు సంబంధించి 84 శాతం సీఎంఆర్ రికవరీ కాగా, 2024 -25 ఖరీఫ్ సీజన్‌లో 61 శాతం, 2024-25 రబీ సీజన్‌లో 10 శాతం మేర సీఎంఆర్ రకవరీ జరిగింది.
కఠిన చర్యలకూ అవకాశం...
సీఎంఆర్‌కు సంబంధించిన ధాన్యం బకాయిలు ఉన్న మిల్లర్లపై కఠిన చర్యలకూ ప్రభుత్వం సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. రూ. కోట్లలో బకాయిలు ఉన్న మిల్లులపై ఇప్పటికే పలు రకాల చర్యలు చేపట్టగా, అవసరమైన పక్షంలో ఈడీ (డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్) విచా రణ కూడా జరిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మిల్లర్ల బ కాయిలు పేరుకుపోవడంతో ఎలాగైనా రికవరీకి సి ద్ధప డుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం యోచిస్తున్న వి ధంగా ఈడీ రంగంలోకి దిగితే బియ్యం పక్కదారి విష యమేగాక, మిల్లర్ల ఆస్తిపాస్తులపైనా విచారణలో తుగా జరిగే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కొందరు మిల్లర్లు అప్రమత్తమై బకాయిలు చెల్లిస్తుండ గా, మిగతా వారు కూడా దారిలోకి వస్తారనే భావనలో అధికారులు ఉన్నారు. అయితే రూ. కోట్లలో బకాయిలు న్న మిల్లర్లు మాత్రం ప్రజా ప్రతినిధుల అండదండల తో ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.