Share News

బంకాపురం బ్రిడ్జి నిర్మాణమెప్పుడో?

ABN , Publish Date - Aug 18 , 2025 | 12:49 AM

మండలంలోని నిడమనూరు-బంకాపురం గ్రామాల నడుమ చి లుకల వాగుపై పూర్వకాలంలో నిర్మించిన కల్వర్టు పూ ర్తిగా ధ్వంసమై ప్రమాదస్థితికి చేరింది.

బంకాపురం బ్రిడ్జి నిర్మాణమెప్పుడో?
బంకాపురం కల్వర్టు మీదుగా ప్రవహిస్తున్న నీరు

బంకాపురం బ్రిడ్జి నిర్మాణమెప్పుడో?

పూర్తిగా ధ్వంసమై ప్రమాదస్థితికి చేరుకున్న కల్వర్టు

వర్షం వస్తే పలు గ్రామాలకు రాకపోకలు బంద్‌

తరచూ ప్రమాదాలు జరుగుతున్న వైనం

ప్రతిపాదనలకే పరిమితమైన వంతెన నిర్మాణం

నిడమనూరు, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని నిడమనూరు-బంకాపురం గ్రామాల నడుమ చి లుకల వాగుపై పూర్వకాలంలో నిర్మించిన కల్వర్టు పూ ర్తిగా ధ్వంసమై ప్రమాదస్థితికి చేరింది. కల్వర్టు వద్ద బ్రిడ్జి నిర్మాణం కలగానే మిగిలిపోయింది. కల్వర్టు శిథిలావస్థకు చేరడంతో గతంలో కురిసిన వర్షాలకు అనేకసార్లు తెగిపోయింది. కల్వర్టు తెగిపోవడంతో ఎన్నో ప్ర మాదాలు జరిగాయి. మండలంలోని బంకాపురం, వెనిగండ్ల, సూరేపల్లి తదితర గ్రామాల ప్రజలు ఈ కల్వర్టు మీదుగా మండల కేంద్రానికి రాకపోకలు సాగిస్తుంటా రు. భారీ వర్షాలు కురవడంతో పాటు నిడమనూరు చెరువు నిండి అలుగు పోస్తే కల్వర్టు మీదుగా ఉధృతం గా వరదనీరు ప్రవహిస్తుంటుంది. దీంతో వివిధ గ్రా మాలకు రాకపోకలు నిలిచిపోతాయి. 14వ మైలురాయి చెక్‌పోస్టు మీదుగా ఆయా గ్రామాలకు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కల్వర్టు పూర్తిగా శిథిలమవడంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. కల్వర్టు తెగిపో యి ప్రమాదాలు జరుగుతున్నా కల్వర్టు స్థానంలో బ్రిడ్జి నిర్మించకపోవడంతో పాటు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయకుండా గూనలు వేసి మట్టి పోసి చేతు లు దులుపుకున్నారు. మట్టి పోయడం వలన కోతకు గురవుతుంది. గతంలో కల్వర్టు మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.5లక్షల నిధులు మంజూరు చేసినా సరై న మరమ్మతులు చేయకుండా పైపైన మట్టి పోసి బిల్లులు ఎత్తుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పూర్తిగా శిథిలమై ప్రమాదస్థితిలో ఉన్న బంకాపురం కల్వర్టు మీ దుగా ప్రమాదమని తెలిసినా రాకపోకలు సాగించాల్సి న దుస్థితి ఉంది. గతంలో నిడమనూరు ఆదర్శ పాఠశాలలో వాచ్‌ఉమెన్‌గా పనిచేస్తున్న పెందోటి లక్ష్మి అనే మహిళ వాగు దాటుతూ ప్రమాదవశాత్తు నీటిలో జా రిపడి గూనల్లో ఇరుక్కుని మృతి చెందింది. భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమె భర్త నర్సింహ ఆత్మహత్య చే సుకున్నాడు. బంకాపురం గ్రామానికి చెందిన ఓ రైతు ట్రాక్టర్‌ కూడా కల్వర్టులో పడిపోయింది. గత ప్రభుత్వ హయాంలో బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరై నా టెండర్లు ఖరారు కాకపోవడంతో బ్రిడ్జి నిర్మాణం అ టకెక్కింది. ప్రస్తుతం రూ.3కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికైనా నిడమనూరు-బంకాపురం గ్రామాల నడుమ చిలుకల వాగుపై ఉ న్న కల్వర్టు స్థానంలో సత్వరమే వంతెన నిర్మాణం చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి

బంకాపురం కల్వర్టు పూర్తిగా దెబ్బతిని ప్రమాదాలకు నిలయంగా మారింది. కల్వర్టు వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ మార్గంలో వివిధ గ్రామాల ప్రజలు ప్రయాణం సాగిస్తుంటారు. వర్షాల కారణంగా వరదనీరు కల్వర్టు మీదుగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి కల్వర్టు వద్ద వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలి.

- పోలే రవి, వెనిగండ్ల

రూ.3 కోట్లతో ప్రతిపాదనలు పంపాం

బంకాపురం కల్వర్టు వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు రూ.3 కోట్ల నిధుల అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే టెండర్‌ ఖరారు చేసి కల్వర్టు వద్ద వంతెన నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం.

- సాయిప్రసాద్‌, పీఆర్‌ ఏఈ

Updated Date - Aug 18 , 2025 | 12:49 AM