Share News

ఫార్మాసిస్ట్‌ పరీక్ష ఫలితాలెప్పుడో...?

ABN , Publish Date - Nov 23 , 2025 | 11:10 PM

ఫార్మాసిస్ట్‌ గ్రేడ్‌-2 ఉద్యోగ నియామకాల పరీక్షకు సంబంధించి ప్ర భుత్వం ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తుందోనని అభ్య ర్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఫార్మాసిస్ట్‌ పరీక్ష ఫలితాలెప్పుడో...?

-గతేడాది నవంబరులో కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామ్‌ నిర్వహణ

-ఇప్పటి వరకు విడుదలకాని ప్రొవిజినల్‌ లిస్టు

-జిల్లా వ్యాప్తంగా వంద మంది అభ్యర్థుల ఎదురు చూపు

-కనీస అర్హత మార్కులు లేకపోవడంపై అభ్యంతరం

-నేరుగా వెయిటేజీ ఇవ్వడంతో అర్హులకు అన్యాయం

మంచిర్యాల, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఫార్మాసిస్ట్‌ గ్రేడ్‌-2 ఉద్యోగ నియామకాల పరీక్షకు సంబంధించి ప్ర భుత్వం ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తుందోనని అభ్య ర్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఫార్మాసిస్ట్‌-2 ఉద్యోగ నియామక ప్రక్రియలో కొందరు అభ్యర్థులకు ’ద్వంద్వ ప్రయోజనాలు’ చేకూరుతుండటం వివాదానికి దారితీ సింది. ఈ విషయంలో కొందరు కోర్టును ఆశ్రయించడం తో ప్రొవిజినల్‌ లిస్టు విడుదలకు మోక్షం కలగడం లేదు. చాలా ఏళ్ల తరువాత ప్రభుత్వం ఫార్మాసిస్టు గ్రేడ్‌-2 ఉద్యోగ నియామకాల కోసం గత ఏడాది సెప్టెంబర్‌ 24న 732 పోస్టులతో కూడిన భారీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అదే ఏడాది నవంబరు 31న కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష నిర్వ హించగా, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 27వేల మంది అభ్య ర్థులు హాజరయ్యారు. అయితే ప్రశ్నపత్రాల మూల్యాం కనం పూర్తయినప్పటికీ ఏళ్లు గడుస్తున్నా ప్రొవిజినల్‌ లి స్టు విడుదల చేయడంలో జాప్యంపై అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆ పరీక్షకు జిల్లా నుంచి దాదాపు వంద మంది వరకు హాజరయ్యారు.

వివాదానికి దారితీసిన 20 శాతం వెయిటేజీ...

ఫార్మాసిస్ట్‌ గ్రేడ్‌-2 కంప్యూటర్‌ ఆధారిత పరీక్షకు ఫా ర్మసీ ప్రాక్టీస్‌ రెగ్యులేషన్స్‌ -2015 అనుబంధం-3 ప్రకారం డిప్లొమా, బీ ఫ్మార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. అయితే పరీక్షకు హాజరయ్యేందుకు ప్రభుత్వం నోటిఫికేష న్‌లో ఎటువంటి శిక్షణ, అనుభవాన్ని సూచించకపోగా, పాలసీ నిర్ణయం పేరిట కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఫార్మా సిస్ట్‌లకు గరిష్టంగా 20 మార్కులు అదనంగా వెయిటేజీ జతపరచడం వివాదానికి దారి తీసింది. మిగిలిన 80 శాతం రాత పరీక్షకు కనీస అర్హత మార్కులు పెట్టకుం డా నేరుగా వెయిటేజీ చేర్చడం గమనార్హం. ఈ విధానం లో పరీక్షలో సాధించిన మార్కులతో పనిలేకుండానే కాం ట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఫార్మాసిస్ట్‌లు నేరుగా ఉద్యోగానికి ఎంపిక అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం వెయిటేజీ కల్పించడం వల్ల అన్ని అర్హతలు గలిగి ఉండి, 80 మార్కుల పరీక్షలో అ త్యధిక మార్కులు పొందిన వారికి ఉద్యోగం వస్తుందన్న గ్యారెంటీ లేదు. 80 మార్కుల రాత పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు 60 శాతానికి పైగా మార్కులు సా ధించగా, వెయిటేజీ లేని కారణంగా వారికి ఉద్యోగ అవ కాశాలు లభించే పరిస్థితులు కనిపించడంలేదు. దీంతో రాత పరీక్షలో ఉన్నత మార్కులు సాధించిన వారు వె యిటేజీ మార్కులను తప్పు బడుతూ హై కోర్టును ఆశ్ర యించారు. దీంతో ప్రొవిజినల్‌ విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

రెండు చోట్లా ప్రయోజనం...

ప్రభుత్వ వైద్య విభాగంలో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సేవల్లో పని చేసినవారికి పని కాలాన్ని బట్టి 20 శాతం వెయిటేజీ పాయింట్లను వైద్య ఆరోగ్యశాఖ కేటాయిస్తోం ది. కొందరు అభ్యర్థులు ప్రభుత్వ దవాఖానాల్లో ఫార్మిసి స్ట్‌లుగా కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో సేవలు అందిస్తూనే ప్రైవేటు మెడికల్‌ షాపుల్లోనూ పని చేస్తూ ప్రయోజనం పొందుతున్నారు. ఈ విషయమై పరీక్షకు హాజరైన కొందరు మెరిట్‌ అభ్యర్థులు వైద్య ఆరోగ్యశా ఖ లో ఫిర్యాదు చేశారు. అధికారుల విచారణలో రెండు చో ట్లా ప్రయోజనం పొందుతున్నట్లు రుజువు కావడంతో వారికి ప్రభుత్వం కల్పించిన వెయిటేజీని రద్దు చేయాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వంలో ఏకకాలంలో రెండు చోట్ల పనిచేయడం సర్వీస్‌ నిబంధనలకు విరు ద్దం. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు రావడంతో వైద్య ఆరో గ్యశాఖ విచారణ చేపట్టింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాం ట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పని చేస్తూ, అదే స మయంలో ప్రైవేటు మెడికల్‌ షాపుల్లో రిజిస్టరైన ఫా ర్మాసిస్ట్‌ల వివరాలు సేకరించింది. ఇలా రెండు చోట్లా ప్ర యోజనం పొందడాన్ని కొందరు అభ్యర్థులు సవాల్‌ చే స్తూ హై కోర్టును ఆశ్రయించారు. రెండు చోట్లా ప్రయో జనం పొందుతున్న వారిలో పరీక్షకు హాజరైన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా 900కు పైగా ఉన్నట్లు గుర్తించగా, జిల్లాలోనూ పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.

అద్దెకు సర్టిఫికెట్లు....

మెడికల్‌ షాపుల్లో డిప్లొమా, బీ ఫ్మార్మసీ పూర్తి చేసిన వారు ఉండాలనే నిబంధన ఉంది. వారికి తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌ అర్హత సర్టిఫికెట్లు ప్రదానం చేస్తుంది. అప్పుడే వారికి మెడికల్‌ షాపులు నిర్వహించేందుకు అర్హత లభిస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం మెడికల్‌ షాపుల్లో అర్హతగల నిర్వాహకులు లేరు. ఈ వి షయం వైద్య ఆరోగ్యశాఖ అధికారుల విచారణలోనే తే లింది. దీంతో మెడికల్‌ షాపుల్లో అద్దెకు తీసుకున్న సర్టిఫి కేట్ల ఆధారంగా మందులు విక్రయిస్తున్నట్లు తెలు స్తోం ది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫార్మాసిస్ట్‌లుగా కొనసాగుతున్న వారిలో అనేక మంది తమ సర్టిఫికేట్లను ప్రైవేటు మెడికల్‌ షాపులకు అద్దెకు ఇచ్చినట్లు విచార ణలో తేలింది. ఇందుకుగాను సర్టిఫికేట్‌ అద్దెకు ఇచ్చిన వారు వేతనం రూపంలో మెడికల్‌ షాపుల నుంచి లబ్ది పొందుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇలా ఫార్మాసి స్ట్‌గా ఉద్యోగం చేస్తూ, సర్టిఫికేట్లు అద్దెకు ఇచ్చిన వారికి వెయిటేజీ ఇవ్వడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతుం డ గా, ఈ విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఇదిలా ఉండగా, ఇటీవల తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఇదే తరహా ఫార్మిసిస్ట్‌ నోటిఫికేషన్‌లో 100 మార్కులకు కనీస అర్హత మార్కులు పెట్టి, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ సేవలు అందించిన వారికి కేవలం 5 శా తం వెయిటేజీ ఇచ్చింది. తెలంగాణలో సైతం రాత పరీ క్షకు కనీస మార్కులు కేటాయిస్తూ, అదే తరహాలో వె యిటేజీని తగ్గించడం ద్వారా మెరిట్‌ అభ్యర్థులకు ఉదో ్యగావకాశాలు కల్పించాలనే అభ్యర్థనలు వినిపిస్తున్నాయి.

Updated Date - Nov 23 , 2025 | 11:10 PM