Share News

ఏడాదిన్నర కాలంలో వెలగబోసిందేమిటి...

ABN , Publish Date - Apr 27 , 2025 | 11:23 PM

ఏడాదిన్నర కాలంలో చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి వెలగబోసిందేంటని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్ర హం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఏడాదిన్నర కాలంలో వెలగబోసిందేమిటి...
చెన్నూరులో జెండా ఆవిష్కరిస్తున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌

-ఎమ్మెల్యే వివేక్‌పై మండిపడ్డ బాల్క సుమన్‌

చెన్నూరు, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి) : ఏడాదిన్నర కాలంలో చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి వెలగబోసిందేంటని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్ర హం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ సంవత్సరన్నర కాలంలో ఏం అభివృద్ధి చేశారని ఆయన ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి పనులను టెంకాయలు కొట్టి ప్రారంభించడం సిగ్గు చేటన్నారు. చెన్నూరులో సబ్‌స్టేషన్‌ నిర్మాణం, క్యాతనపల్లి రైల్వే ఓవర్‌ బ్రిడ్జి ఎవరి హయాంలో నిర్మాణమయ్యాయో ప్రజలందరికి తెలుసన్నారు. 40 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో మీరే ఈ ప్రాంత నాయకులుగా కొనసాగారని, అప్పుడు ఈ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే, సీఎంలు ఇచ్చిన హామీ లు ఏమయ్యాయన్నారు. ఇసుక అక్రమ రవాణా అడ్డగోలుగా జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. ఇచ్చిన హామీలపై ఇక నుంచి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. స్ధానిక సంస్థల ఎన్నిక ల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. అనంతరం వరంగల్‌ రజతోత్సవ సభకు వెళ్లే వాహనా లను జెండా ఊపి ప్రారంభించి సభకు తరలివెళ్లారు. బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫబీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం మండలంలోని దుగ్నేపల్లి, ఆస్నాద, నాగా పూర్‌ తదితర గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్క రించారు. అనంతరం వరంగల్‌లో జరిగే రజతోత్సవ సభకు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.

Updated Date - Apr 27 , 2025 | 11:23 PM