Share News

అటవీ సంపదకు రక్షణ ఏదీ...?

ABN , Publish Date - Oct 16 , 2025 | 11:05 PM

జిల్లాలో అటవీ సంపదకు రక్షణ లేకుండా పోయింది. స్మగ్లర్ల గొ డ్డలి వేటుకు అడవులు పూర్తిగా అంతరించిపోతున్నా యి. ఒకప్పటి ఆదిలాబాద్‌ జిల్లా దట్టమైన అడవులకు పెట్టింది పేరు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.

అటవీ సంపదకు రక్షణ ఏదీ...?
తానిమడుగు బీట్‌లో ఇటీవల నరికివేతకు గురైన టేకు వృక్షాలు

-స్మగ్లర్ల వేటుకు అంతరించిపోతున్న అడవులు

-జిల్లా ఎల్లలు దాటుతున్న టేకు కలప

-ఒక్క తానిమడుగు బీట్‌లోనే వందల చెట్లు నరికివేత

-సీసీ కెమెరాలున్నా ఆగని కర్ర తరలింపు

మంచిర్యాల, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అటవీ సంపదకు రక్షణ లేకుండా పోయింది. స్మగ్లర్ల గొ డ్డలి వేటుకు అడవులు పూర్తిగా అంతరించిపోతున్నా యి. ఒకప్పటి ఆదిలాబాద్‌ జిల్లా దట్టమైన అడవులకు పెట్టింది పేరు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఆ యా ప్రభుత్వాల నిర్లక్ష్యం, కొందరు అటవీ అధికారుల పట్టింపులేని తనంతో అత్యంత విలువైన కలప స్మగ్లర్ల గొడ్డలివేటుకు మాయమవుతోంది. అటవీ సంపద రక్షణకు ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తు న్నా... ఆశించిన స్థాయిలో ఫలితం ఉండటంలేదు.

అటవీ విస్తీర్ణం ఇలా...

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో మొత్తం 7,101.30 చదరపు కిలోమీటర్ల మేర అడవులు విస్తరిం చి ఉన్నాయి. ఆదిలాబాద్‌ డివిజన్‌లో 1898.95 చదరపు కిలోమీటర్లు, బెల్లంపల్లి డివిజన్‌లో 1524.39, జన్నారం డివిజన్‌లో 643.74, కాగజ్‌నగర్‌ డివిజన్‌లో 893.29, మంచిర్యాల డివిజన్‌లో 1115.37, నిర్మల్‌ డివిజన్‌లో 1025.16 చదరపు కిలోమీటర్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. ఇక్కడి కలపకు మంచి డిమాండ్‌ ఉండటం తో స్మగ్లర్ల కన్ను వాటిపై పడి క్రమేపీ అడవులు పలు చబడుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో లక్షా 76వేల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉండగా, అటవీ అఽధికా రులు వీటిని 195 బీట్లుగా విభజించి సంరక్షిస్తున్నారు. ఇందుకోసం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తు న్నా...స్మగ్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. వణ్య సంపద రక్షణ కోసం అడవుల్లో సీసీ కెమెరాలు ఏర్పా టు చేసినప్పటికీ అవి నిరుపయోగంగా మారాయి. కేవ లం అడవుల్లో ఏ జాతికి చెందినవి ఎన్ని వృక్షాలు ఉ న్నాయో లెక్కలు వేసుకోవడానికే అవి ఉపయోగప డుతున్నట్లు ఉన్నాయి.

ఎల్లలు దాటుతున్న కలప...

జిల్లాలోని తాళ్లపేట రేంజ్‌ పరిధిలో లభించే టేకు కలపకు మంచి ఆధరణ ఉంది. నాణ్యమైన కలప కావ డంతో అక్కడి కర్రతో గృహ అవసరాలు, ఇతర ఫర్నీచ ర్‌ చేయించుకునేందుకు ప్రజలు ఉత్సాహం కనబరు స్తుంటారు. దీంతో స్మగ్లర్ల కళ్లు ఈ ప్రాంతంపై పడు తుంటాయి. అదును చూసుకొని విలువైన టేకు చెట్లను నరికివేస్తూ గట్టు చప్పుడు కాకుండా తమ పని కాని స్తుంటారు. స్మగర్లకు కొందరు అటవీ అధికారుల అండ దండలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వారి అండదండలతోనే కలప అటవీ ప్రాంతం దాటుతుం డగా, జిల్లా ఎల్లలు దాటి ఇతర ప్రాంతాలకు తరలిపో తోంది. నిత్యం నిఘా ఉంచాల్సిన సిబ్బంది, కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అటవీ సంపద కరిగి పోతోందన్న విమర్శలు ఉన్నాయి.

వందల సంఖ్యలో టేకు చెట్లు నరికివేత...

ఇటీవలి కాలంలో వందల సంఖ్యలో టేకు చెట్టు స్మ గ్మర్ల దాహానికి నేలకొరిగాయి. అటవీశాఖ తాళ్లపేట రేం జ్‌ పరిధి తానిమడుగు బీట్‌లోని 394వ కంపార్ట్‌మెం ట్‌లో ఇటీవల స్మగ్లర్లు పెద్ద మొత్తంలో టేకు చెట్లను నరికివేశారు. దసరా పండుగ తరువాత దాదాపు 50 టేకు చెట్లను నరికివేసిన స్మగ్లర్లు కలపు అక్రమంగా త రలించుకుపోయారు. అయినా సంబంధిత అధికారుల కు సమాచారం లేకపోవడం గమనార్హం. ఆ తరువాత సమాచారం అందుకున్న అధికారులు డాగ్‌ స్క్వాడ్‌ స హాయంతో తనిఖీలు చేపట్టగా కొట్టివేసిన చెట్ల మొద ళ్లు దర్శనమిచ్చాయి. డాగ్‌ స్క్వాడ్‌ సహాయంతో నింది తుల సమాచారం లభించినా, అప్పటి వరకు స్మగ్లర్ల క దలికలు అఽధికారుల దృష్టికి రాకపోవడం గమనార్హం. అటవీ అధికారుల వ్యవహారం చూస్తుంటే ’చేతులు కా లినంక...ఆకులు పట్టుకున్న’ సామెత గుర్తుకు వస్తోంది. ఒక్క బీట్‌లోనే ఇంత పెద్ద మొత్తంలో కలపను తరలిం చారంటే...ఇతర ప్రాంతాల్లో ఇంకా ఏ మేరకు కర్ర స్మ గ్లింగ్‌ జరిగిందోనన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

సౌకర్యాలున్నా...ఉపయోగం సున్నా...

ప్రభుత్వం అటవీ సిబ్బందికి అన్ని వసతులు సమ కూరుస్తోంది. నెలనెలా వేలకు వేలు వేతనాలు చెల్లి స్తోంది. అడవుల్లో తిరిగేందుకు మోటారు సైకిళ్లు, నావి గేషన్‌ కోసం ఖరీదైన సెల్‌ఫోన్లు, నిఘా కోసం సీసీ కె మెరాలు అందజేస్తోంది. స్మగ్లర్ల ఆట కట్టించేందుకు స్థా నిక పోలీసుల సహకారం తీసుకునే వెసులుబాటు క ల్పించింది. కానీ అటవీశాఖ అఽధికారులు, సిబ్బందిలో నెలకొన్న నిర్లిప్తత, నిర్భీతి కారణంగా ఎలాంటి ఫలితం లేకుండా పోతోంది. కీలక ప్రాంతాల్లో రాత్రింబవళ్లు కా పలా కాసేందుకు అటవీ డివిజన్ల వారీగా బేస్‌ క్యాంపు లు ఏర్పాటు చేసినా వాచర్లు కనిపించడం లేదనే వి మర్శలున్నాయి. అడవుల రక్షణ కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ అవసరమైన సౌకర్యాలు కల్పి స్తున్నా...ఉపయోగం లేకుండా పోతోందనే అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Oct 16 , 2025 | 11:05 PM