kumaram bheem asifabad- ఆటలకు చోటేది?
ABN , Publish Date - Jul 16 , 2025 | 11:06 PM
జిల్లాలోని సర్కారు బడుల్లో విద్యాప్రమాణాల మాట ఎలా ఉన్నా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే ఆటలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. చదువుతో పాటు ఆటలు ఉన్నప్పుడే పిల్లలు మానసి కంగా, ఆరోగ్యంగా ఎదుగుతారు. కానీ జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ఆడుకునే మైదానాలు, ఆటల పరికరాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
- పాలకుల హామీలే తప్ప కనిపించని ఆచరణ
- భర్తీ కాని వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు
జిల్లాలోని సర్కారు బడుల్లో విద్యాప్రమాణాల మాట ఎలా ఉన్నా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే ఆటలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. చదువుతో పాటు ఆటలు ఉన్నప్పుడే పిల్లలు మానసి కంగా, ఆరోగ్యంగా ఎదుగుతారు. కానీ జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ఆడుకునే మైదానాలు, ఆటల పరికరాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
ఆసిఫాబాద్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): కుుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆటలు అటకెక్కుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా మైదానాలు లేకపోవడం తో విద్యార్థులు క్రీడలకు దూరమవుతు న్నారు. పాఠశాలల్లో ఓ వైపువ్యాయమా ఉపాధ్యాయుల కొర త అతిగతిలేని మైదానాలతో క్రీడలకు బావి క్రీడాకా రులు దూరమవుతున్నారు. దీంతో విద్యార్థులకు క్రీడ లు అందని ద్రాక్షగా మిగిలిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులు వారిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించలేక పోతున్నారు. ఇదిలా ఉండ గా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న మినీ స్టేడియం జిల్లా ఏర్పాటులో భాగంగా పోలీసుశాఖకు కేటాయిం చారు. అందులో ఏఆర్ హెడ్‌క్వార్టర్ ను ఏర్పాటు చేశారు. దీంతో పట్టణంలోని యువకులు, క్రీడాకారు లు, వాకర్స్ వ్యాయమానికి దూరమవుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగాణాలు క్రీడా సదుపాయాలు లేకపోవడంతో అలంకారప్రాయంగానే మిగిలిపోతున్నాయి.
- జిల్లాలో 1,258 పాఠశాలలు..
జిల్లాలో మొత్తం 1,258 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 908 ప్రాథమిక, 180 ప్రాథమికోన్నత, 170 ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందులో సగానికి పైగా పాఠశాలల్లో క్రీడామైదనాలులేవు. ఇక వ్యాయమ విద్యను బోదించే పీఈటీ, పీఈడీ పోస్టులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఖాళీ పోస్టులు భర్తీకి నోచుకోకుండా ఉన్నాయి. ప్రాథమిక స్థాయి లోనే నిర్భంద వ్యాయమవిద్య ప్రవేశపెట్టి విద్యార్థుల మానసిక, శారీరక ఎదుగుదలకు దోహదపడే క్రీడలు వ్యాయమం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలి. కానీ ఆ దిశగా ప్రభుత్వం దృష్టి సారించడంలేదు. గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు సదుపాయాలకు నోచుకొవడంలేదు. ఈ ప్రాంగణాలు ఊరు చివర నిర్మిం చడం, చదునుగా లేకపోవడం, పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో ఆటలు ఆడేందుకు అనువుగాలేవు. దీంతో గ్రామీణ క్రీడ ప్రాంగణాలు అలంకరప్రాయంగానే దర్శనమిస్తు న్నాయి. దీంతో గ్రామీణ క్రీడకారులు తమలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యతను ప్రదర్శించలేక పోతున్నారు.
- మినీ స్టేడియం పోలీసుశాఖకు..
జిల్లా కేంద్రంలో అదునిక హంగులతో లక్షలు వె చ్చించి నిర్మించిన మినీ స్టేడియంను ప్రభుత్వం పోలీ సుశాఖకు కేటాయించింది. 2016లో జిల్లా ఏర్పడిన సందర్భంగా అప్పుడే పూర్తయి అందుబాటులో ఉన్న మినీ స్టేడియాన్ని పోలీసుశాఖకు కేటాయించడంతో ప్రస్తుతం ఆ మినీ స్టేడియంలో ఏఆర్ హెడ్‌క్వార్టర్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పట్టణంలోని యువ కులు, క్రీడాకారులు, విద్యార్థులు ఆటలు అడుకునేం దుకు మైదానం లేకుండా పోయింది. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు వాకింగ్, జాగింగ్ చేయాలంటే ఇబ్బందులు పడక తప్పడంలేదు. అలాగే పోలీసు, ఆర్డీ ఉద్యోగాల భర్తీ సమయంలో కసరత్తు చేసుకునేందుకు యువతకు క్రీడామైదానం లేకపోవ డంతో ప్రాక్టిస్ కోసం ఇతర ఖాళీ స్థలాలే దిక్కావుతు న్నాయి. మినీ స్టేడియాన్ని తిరిగి అప్పగించాలని గతంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టినా చర్యలు తీసుకోలేదు.
పకడ్బందీగా అమలు చేయాలి..
- అవిడపు ప్రణయ్, జిల్లా యువజన సంఘం నాయకుడు
పాఠశాలల్లో వ్యాయామ విద్యను పకడ్బందీగా అమలు చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా మైదా నాలు లేకపోవడంతో విద్యార్థులు క్రీడలకు దూరమవు తున్నారు. ప్రభుత్వం క్రీడా మైదానాల నిర్మాణాలతో పాటు ఖాళీగా ఉన్న వ్యాయామ ఉపాధ్యాయుల పో స్టులను భర్తీ చేయాలి. పట్టణంలోని మినీ స్టేడి యాన్ని తిరిగి కేటాయిస్తే క్రీడాకారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.