Share News

kumaram bheem asifabad- కుమరం భీం ప్రాజెక్టుపై పట్టింపేది?

ABN , Publish Date - Jul 31 , 2025 | 10:45 PM

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోనే పెద్దదైన కు మరం భీం ప్రాజెక్టు మనుగడకే ముప్పు కలుగుతున్నది. 45 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిం చేందుకు 10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్టు ఆనకట్ట మూడేళ్ల క్రితం పగుళ్లు తేలింది. నిధులు మంజూరు కాకపోవడంతో ఇప్పటికీ మరమ్మతులకు నోచుకోవడం లేదు.

kumaram bheem asifabad- కుమరం భీం ప్రాజెక్టుపై పట్టింపేది?
పగుళ్లు తేలిన ప్రాజెక్టు ఆనకట్ట

- కవర్లు కప్పిన అధికారులు

- నిధులు లేక మరమ్మతులకు నోచుకోని వైనం

- భారీ వర్షాలు కురిస్తే తప్పని ముప్పు

- ఆందోళనలో ఆయకట్టుదారులు

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోనే పెద్దదైన కు మరం భీం ప్రాజెక్టు మనుగడకే ముప్పు కలుగుతున్నది. 45 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిం చేందుకు 10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్టు ఆనకట్ట మూడేళ్ల క్రితం పగుళ్లు తేలింది. నిధులు మంజూరు కాకపోవడంతో ఇప్పటికీ మరమ్మతులకు నోచుకోవడం లేదు.

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): బీడు భూములకు సాగు నీరందించాలనే లక్ష్యంతో ఆసిఫా బాద్‌ మండలం అడ పెద్దవాగుపై నిర్మించిన కుమ రంభీం ప్రాజెక్టు ప్రమాదపుటంచులో ఉంది. ప్రాజెక్టు ప్రారంభించి పుష్కర కాలం దాటినా నేటికి పంటలకు నీరందక పోవడంతో ఆయకట్టు దారులు తీవ్రంగా నష్టపోతున్నారు. 2005లో 10 టీఎంసీల సామర్థ్యంతో 45వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే భావనతో రూ. 450 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. 2011లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పనులను ప్రారంభించారు. ప్రధాన కాలువలు పూర్తయినా వర్షాలకు పడిన గండ్లకు మరమతులు చేయకపోవడంతో చుక్కనీరు వదలక మూడేళ్లు దాటి పోయింది. రైతులు కాలు వలలో నిలువ ఉన్న నీటిని, సమీపంలోని వాగుల నుంచి ఆయిల్‌ ఇంజన్‌ల ద్వారా పంటలకు అందిం చుకుంటూ అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు ఆనకట్ట దెబ్బతిని బలహీనంగా మారింది. నీటి తాకిడికి కుంగి పోయింది. ఆనకట్ట కుంగి మూడేళ్లు గడుస్తున్నా అధికారులు మరమతులు చేపట్టకుండా కట్టపై పాలిథీన్‌ కవర్లు కప్పించారు. ప్రాజెక్టు ఆనకట్ట దెబ్బతినడంతో 5.8 టీఎంసీలకు మించి నీటిని అధికారులు నిలువ చేయడం లేదు.

- భారీ వర్షాలు కురిస్తే..

ఒక వేళ భారీ వర్షాలు కురిసి వరదనీరు చేరితే కట్టకు వేసి మట్ట కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. జూలై 2022లో కురిసిన బారీ వర్షాలకు ఆనకట్ట దెబ్బ తిన్నది. నిర్మాణ సంస్థ ప్రాజెక్టు పనులను నాసిరకంగా చేపట్టడంతో భారీ వర్షాలకు ఆనకట్ట కుంగి బీటలు వారింది. వరద ఉధృతికి కుడివైపు చివరి భాగంలో 300 మీటర్ల మేర దెబ్బతిన్నాయి. రాళ్లు, మట్టి కొట్టుకుపోయి బలహీనంగా మారింది. నీటి తాకిడికి ఆనకట్ట కుంగిపోయింది. దీంతో ఇంజనీరింగ్‌ అధికా రులు పాలిథీన్‌ కవర్లు కప్పారు. మరమ్మతు పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ప్రాజె క్టు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.

- వరదనీరు చేరితే..

వరదనీరు వచ్చి ప్రాజెక్టులోకి చేరితే గండిపడకుం డా గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ఆసిఫాబాద్‌ మండలంలో కుడి కాలువ ద్వారా 6వేల ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా 39వేల ఎకరాలు ఆసిఫాబాద్‌ మండలంతో పాటు వాంకిడి, కాగజ్‌నగర్‌ మండలాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రాజెక్టు నిలువ సామర్థ్యం తగ్గించడం, కాలువలు అధ్వానంగా మారడంతో పంట పొలాలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టులోని నీరు ప్రస్తుతం మిషన్‌ భగీరథ నీటి సరఫరా, చేపల పెంపకం కోసం మాత్రమే ఉపయోగపడుతుంది.

మరమ్మతులకు ప్రతిపాదనలు..

- గుణవంత్‌రావు, ఈఈ

అనకట్ట మరమ్మతు కోసం రూ. 15కోట్లు అంచ నాతో ప్రతిపాదనలు పంపాం. తాత్కాలిక మరమ్మ తుల కోసం రూ. 34 లక్షలు మంజూరయ్యాయి. వర్షా కాలం నేపథ్యంలో పనులు చేపట్టలేదు. అక్టోబరులో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం.

Updated Date - Jul 31 , 2025 | 10:45 PM