Share News

kumaram bheem asifabad- సేంద్రియ ఎరువు జాడేది?

ABN , Publish Date - Nov 01 , 2025 | 10:07 PM

గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచడంతో పాటు వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారీ లక్ష్యంగా సెగ్రిగేషన్‌ షెడ్లు నిర్మించారు. పల్లెల అభ్యున్నతి కోసం అప్పటి ప్రభు త్వం గ్రామాల్లో సేంద్రియ ఎరువులు తయారీ కోసం షెడ్ల నిర్మాణం చేపట్టింది. పారిశుధ్య నిర్వహణతో పాటు సేంద్రియ ఎరువును సమకూర్చాలని ఒక్కో పంచాయతీకి సెగ్రిగేషన్‌ షెడ్డును అందుబాటులోకి తీసురావాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు ఒక్కో షెడ్డుకు రూ.2.40లక్షలు మంజూరు చేసింది. గ్రామాల్లో సేకరించిన చెత్తను ఇక్కడికి చేర్చి గాజు, ఇనుము, ప్లాస్టిక్‌ వంటి తదితర పొడి చెత్త వ్యర్థాలను వేరు చేసి గడులలో భద్రపరుస్తారు. తడి చెత్తను కుండీలలో వేసి సేంద్రియ ఎరువును తయారు చేస్తా రు. వీటి నిర్వహణ బాధ్యతను సర్పంచ్‌లకు అప్పగించారు. వీటి ద్వారా గ్రామాల్లో సేంద్రియ ఎరువులను తయారు చేసి రైతులకు విక్రయించాలి.

kumaram bheem asifabad- సేంద్రియ ఎరువు జాడేది?
బెజ్జూరు మండలం రెబ్బెనలో నిరుపయోగంగా ఉన్న సెగ్రిగేషన్‌ షెడ్డు

- నిర్మాణాలు పూర్తయినా పట్టింపు కరువు

- ఎక్కడా కనిపించని కంపోస్టు తయారీ

- పట్టించుకోని ప్రభుత్వం, అధికారులు

బెజ్జూరు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచడంతో పాటు వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారీ లక్ష్యంగా సెగ్రిగేషన్‌ షెడ్లు నిర్మించారు. పల్లెల అభ్యున్నతి కోసం అప్పటి ప్రభు త్వం గ్రామాల్లో సేంద్రియ ఎరువులు తయారీ కోసం షెడ్ల నిర్మాణం చేపట్టింది. పారిశుధ్య నిర్వహణతో పాటు సేంద్రియ ఎరువును సమకూర్చాలని ఒక్కో పంచాయతీకి సెగ్రిగేషన్‌ షెడ్డును అందుబాటులోకి తీసురావాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు ఒక్కో షెడ్డుకు రూ.2.40లక్షలు మంజూరు చేసింది. గ్రామాల్లో సేకరించిన చెత్తను ఇక్కడికి చేర్చి గాజు, ఇనుము, ప్లాస్టిక్‌ వంటి తదితర పొడి చెత్త వ్యర్థాలను వేరు చేసి గడులలో భద్రపరుస్తారు. తడి చెత్తను కుండీలలో వేసి సేంద్రియ ఎరువును తయారు చేస్తా రు. వీటి నిర్వహణ బాధ్యతను సర్పంచ్‌లకు అప్పగించారు. వీటి ద్వారా గ్రామాల్లో సేంద్రియ ఎరువులను తయారు చేసి రైతులకు విక్రయించాలి. కాగా ఆయా గ్రామాల్లో నిర్మాణాలు పూర్తయినా సెగ్రిగేషన్‌ షెడ్లు అలంకారప్రాయంగా మారా యి. మరి కొన్ని చోట్ల షెడ్లలోని గడుల్లో తడి, పొడి చెత్తను వేసి అలాగే వదిలేశారు. దీంతో సెగ్రిగేషన్‌ షెడ్ల పరిసర ప్రాంతాల్లో కాలుష్యం పెరుగుతోంది. దీన్ని నివారించడానికి, సేంద్రియ ఎరువు తయారు చేయడానికి నిర్మించిన షెడ్లు ఎక్కడా కూడా వినియోగంలోకి తీసుకొచ్చేం దుకు చర్యలు తీసుకోవడం లేదు.

- 335 పంచాయతీల పరిధిలో..

జిల్లా వ్యాప్తంగా మొత్తం 335 గ్రామ పంచాయతీ ల పరిధిలో షెడ్లు నిర్మాణాలను పూర్తి చేశారు. గ్రామాల్లో సేంద్రియ ఎరువుల తయారిపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. ప్రతి రోజు ఇళ్ల నుంచి సేకరించిన తడి పొడి చెత్తను వేరు చేసి వాటిని అమ్మితే గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరుతుంది. మిగితా చెత్తను నాడెప్‌ వర్మి కంపోస్టు ట్యాంకులో వేసి ఎరువు తయారు చేసి విక్రయించడంతో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సేంద్రియ ఎరువుల తయారీకి అప్పట్లో వానపాములను కూడా సరఫరా చేసినా ఫలితం లేకుండా పోయిందని చెబుతున్నారు.

- అవగాహన లోపంతోనే..

గ్రామాల్లో పారిశుధ్య సిబ్బందికి, కార్యదర్శులకు సేంద్రియ ఎరువు తయారీపై అవగాహన లేకపోవడంతోనే సెగ్రిగేషన్‌ షెడ్లు నిరుపయోగంగా మారా యని చెబుతున్నారు. అప్పట్లో వీరికి శిక్షణ ఇచ్చినప్పటికీ వర్మి కంపోస్టు తయారీ పద్ధతి తెలియకపోవడం, పంచాయతీల్లో సరిపడా సిబ్బంది, గ్రామాల్లో డంప్‌ యార్డులు లేకపోవడంతోనే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. సంబందిత అధికారులు పట్టించుకోని కారణంగా వృథాగా మారా యి. కొన్ని పంచాయతీల్లో మాత్రం షెడ్లను వినియోగించుకుంటూ సేంద్రీయ ఎరువును తయారీ చేసి పంచాయతీకి ఆదాయం సమకూర్చుతున్నా పూర్తిస్థాయిలో తయారీ లేక ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు.

- నిర్వహణలో నిర్లక్ష్యం..

గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణంతో అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. వీటి నిర్మాణంలో చూపిన శ్రద్ధ నిర్వహణలో చూపకపోవ డంతో ఎరువుల తయారీకి అవకాశం ఉన్నా అంది పుచ్చుకోలేదు. కాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో సేంద్రియ ఎరువుల తయారిపై దృష్టి సారిస్తారేమో నన్న ఆశలు చిగురిస్తున్నాయి. అయితే అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎరువుల తయారీకి నోచుకోక మూలనపడ్డాయి. ప్రస్తుతం గ్రామపంచాయ తీల పాలనా గడువు కూడా ముగియడం, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం నోటిఫికేషన్‌ విడుద లైనా కోర్టు తీర్పు కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. అయితే గ్రామ పంచాయతీల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవ డంతో పారిశుధ్య కార్య క్రమాలు కూడా చేపట్టలేక సతమతమవుతున్న నేపథ్యంలో సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్వ హణకు నిధులు ఇచ్చేదెవరు, వాటి నిర్వహణను పట్టించుకునేదెవరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీం తో ఇప్పుడు వీటి నిర్వహణపై సందిగ్దం నెలకొంది. స్థానిక సంస్థల గడువు గడిచినప్పటి నుంచి గ్రామపం చాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగు తున్నాయి.

- మూలకు పడిన ట్రాక్టర్లు..

గ్రామపంచాయతీలకు ఆదాయాన్ని సమకూరేందు కు గత ప్రభుత్వం డంపింగ్‌ యార్డులు, సెగ్రిగేషన్‌ షెడ్లను ఏర్పాటు చేసింది. ఇందుకోసం ప్రతి పంచాయతీకి ట్రాక్టర్లను సమకూర్చింది. వాటి ద్వారా ఇంటింటి చెత్తను సేకరించి తడి, పొడి చెత్తను వేరు చేసి ఎరువుల తయారీ చేసేందుకు శ్రీకారం చుట్టగా జిల్లాలో చాలాచోట్ల ట్రాక్టర్లు మరమ్మతుల కు గురై మూలకు చేరాయి. దీంతో గ్రామాల్లో చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదు. దీంతో షెడ్లు పూర్తిగా నిరుపయోగంగా మారాయి. జిల్లాలో ట్రాక్టర్ల నిర్వహ ణ కూడా సరిగా లేని కారణంగా చెత్త సేకరణ అంతంత మాత్రంగానే జరుగుతోంది. పంచాయతీలకు పాలకవర్గాలు లేక ప్రత్యేకాధిరులు గ్రామాల వైపు కన్నెత్తి చూడని కారణంగా కార్యదర్శుల పైనే భారం పడుతుండడంతో వారికి ప్రత్యేకంగా నిధులు లేక వా రు కూడా వాటి నిర్వహణపై శ్రద్ధ చూపడం లేదు.

Updated Date - Nov 01 , 2025 | 10:07 PM