Share News

ఓటర్లకు స్వేచ్ఛ ఏది..?

ABN , Publish Date - Dec 02 , 2025 | 11:29 PM

రాజ్యాం గం 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఐదేళ్లకోసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో స్వేచ్చాయుత వాతావరణంలో ఓ టు హక్కును వినియోగించుకొనే బృహత్తర అవకాశం కల్పించింది. తద్వారా సరైన నాయకుడిని ఎన్నుకొనే హ క్కును ప్రజలకు రాజ్యాంగం కట్టబెట్టింది. రాజ్యాంగ బ ద్దంగా యోగ్యుడైన నాయకుడిని ఎన్నుకొని సుపరిపాలనకు నాంది పలకాల్సిన జనం ప్రలోభాలకు గురవుతున్నారు.

ఓటర్లకు స్వేచ్ఛ ఏది..?

ఎన్నికల ప్రచారంలో డబ్బు ప్రవాహం

రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ పీపుల్స్‌ యాక్టుకు అభ్యర్థుల తూట్లు

-ఈసీ నిబంధనల అమలులో చిత్త శుద్ధి కరువు

-టీ పోల్‌ యాప్‌తో అవినీతికి చెక్‌ పడేనా..?

మంచిర్యాల, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాజ్యాం గం 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఐదేళ్లకోసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో స్వేచ్చాయుత వాతావరణంలో ఓ టు హక్కును వినియోగించుకొనే బృహత్తర అవకాశం కల్పించింది. తద్వారా సరైన నాయకుడిని ఎన్నుకొనే హ క్కును ప్రజలకు రాజ్యాంగం కట్టబెట్టింది. రాజ్యాంగ బ ద్దంగా యోగ్యుడైన నాయకుడిని ఎన్నుకొని సుపరిపాలనకు నాంది పలకాల్సిన జనం ప్రలోభాలకు గురవుతున్నారు. అభ్యర్థులు చూపే ఆశలకు లొంగుతూ అనేక మంది తమ ఇష్టాయిష్టాలకు భిన్నంగా ఓటు వేస్తున్నా రు. ఈ క్రమంలో రాజ్యాంగం కల్పించిన హక్కు దుర్వినియోగం అవడమేగాక చట్ట సభల్లోకి అర్హతలేని వ్యక్తు లు వస్తున్నారు. ఎన్నికలనగానే ధన ప్రభావం విపరీతంగా కనిపిస్తోంది. ఎన్నికల ద్వారా ఓట్లు సంపాదించాలనే క్రమంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో డబ్బు ప్రభా వానికి తెరలేపుతున్నారు. నోటుకు ఓటు అనే చందంగా నేటి రాజకీయాలు తయారుకాగా అటు అభ్యర్థులు, ఇ టు ఓటర్లు సైతం అందుకు తగ్గట్లుగానే వ్యవహరించ డం ప్రమాదకర పరిణామం.

ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు లోబడి....

ఎన్నికల సమయంలో అభ్యర్థులు విపరీతంగా డబ్బు ఖర్చు చేయకుండా నిరోధించేందుకు రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ పీపుల్స్‌ యాక్టు రూపొందించబడింది. 1951 రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ పీపుల్స్‌ యాక్టు ప్రకారం ఎన్నికల కమిషన్‌ నిర్దేచించిన మొత్తానికి లోబడి అభ్యర్థులు డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి సర్పం చ్‌ అభ్యర్థి అయితే ఐదు వేల పైబడి జనాభా ఉన్న చో ట రూ. 2.5 లక్షల లోపు ఖర్చు చేసే వెసులుబాటు క ల్పించింది. ఐదు వేల జనాభాకు తక్కువగా ఉంటే రూ. 1.5 లక్షలు, అలాగే వార్డు సభ్యుల అభ్యర్థుల కోసం ఐ దు వేల పైబడి జనాభా ఉంటే రూ. 50వేలు, అంతకు తక్కువ జనాభా ఉన్నచోట రూ. 30వేలు ఖర్చు చేయా లనే ఆదేశాలు ఉన్నాయి. అంతకు మించి ఖర్చు చేస్తే సదరు అభ్యర్థుల ఖాతాలో జమ చేసే విధంగా నిబంధనలు రూపొందించింది. అయితే ఎన్నికల్లో ఆ చట్టానికి తూట్లు పొడుస్తూ కొందరు అభ్య ర్థులు ఇష్టారీతిన ఖర్చు చేస్తూ ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. చట్టం ప్రకారం పోస్టర్లు, బ్యానర్లు, జెండాలు, హోర్డింగు లు, ర్యాలీలు, సభల నిర్వహణ, వాహనాలు, మైకుల వాడకం త దితర కార్యక్రమాలన్నీ నిర్దేశించిన మొత్తానికి లోబడే జరగాల్సి ఉంది. అయితే ఇందుకు భిన్నంగా ప్రచారంలో డబ్బు పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు.

నిబంధనల అమలులో చిత్తశుద్ధి కరువు...

ఎన్నికల సమయంలో సంస్కరణల పేరిట ఎన్నికల కమిషన్‌ ఎప్పటికప్పుడు మార్పులు తెస్తున్నట్లు చెబుతుందేగానీ వాటి అ మలులో చిత్తశుద్ధి కొరవడిందని, ఎన్ని కల విశ్లేషకులు భావిస్తున్నారు. చట్టంలో లొసుగుల ఆ ధారంగా రెడ్‌ హ్యాండెడ్‌గా డబ్బు లు పంచుతూ పట్టుబడ్డ వారిపై కేసులు నిలిచిన దాఖలాలు లే వని పేర్కొంటున్నారు. ఆర్థికపర విషయాల్లో అభ్యర్థుల తీరు మా రితేగానీ ఓటుకు నోటు విధానంలో మార్పు వచ్చే అవకాశం లే దనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఓటర్లను నేరుగా కలుస్తున్న అభ్యర్థులు ఆ క్రమంలోనే వారికి ఆశచూపుతున్నారనేది విశ్లేషకుల అభిప్రాయం. భారతీయ శిక్షా స్మృ తి చట్టం 1860 సెక్షన్‌ 171 బీ ప్రకారం ఎన్నికల నియమావళిని అతిక్రమించిన అభ్యర్థులకు గరిష్టంగా ఒక సంవత్సరం జైలు శిక్షతోపాటు జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. విచారణలో చట్టాన్ని అతిక్రమించినట్లు రుజువైతే గెన్నికల్లో గెలుపొందిన అ భ్యర్థి సభ్యత్వం రద్దు కావడంతోపాటు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు దేశ చరిత్రలోనే అటు వంటి శిక్షలు అమలు కాకపోవడం విశేషం.

ఫిర్యాదు చేయవచ్చు....

జిల్లా రిటర్నింగ్‌ అధికారి కుమార్‌ దీపక్‌

ఏ ఎన్నికల్లోనైనా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయ డం చట్టరీత్యా నేరం. ఓటర్లను స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకొనేలా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్క రిపై ఉంది. ఎన్నికల్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని దృష్టికి వస్తే ఎవరైనా సరే నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. రిటర్నింగ్‌ అఽధికారులు, పోలీస్‌ శాఖకు ఫిర్యాదు చేయలేని వారు నేరుగా టీ పోల్‌ యా ప్‌ ద్వారా సమాచారం అందిస్తే అవసరమైన చర్యలు ఉంటాయి. అలాగే ప్రతి మండల తహసీల్దార్‌కూ ఫోన్‌ ద్వారా సైతం ఫిర్యాదు చేయవచ్చు. కలెక్టరేట్‌లో ఫిర్యా దుల కోసం ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశాం. 08736-250501 నెంబర్‌కు ఫోన్‌ చేయడం ద్వారా ఫిర్యా దు చేయవచ్చు. ఎన్నికలను సజావుగా నడిపించేందుకు అధికారులకు అన్ని అధికారాలు ఉన్నాయి.

Updated Date - Dec 02 , 2025 | 11:29 PM