Share News

పంటల బీమా ఊసేది...?

ABN , Publish Date - May 14 , 2025 | 11:56 PM

ఉచిత పంటల బీమా పథకం అమలులోలేక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట లు ప్రకృతి వైపరీత్యాల కారణంగా తుడిచిపెట్టుకు పోతున్నా ఆదుకొనేవారు కరువయ్యారు. జిల్లాలో ఏటా ఆకాల వర్షాలు, వడగళ్ల వానలతో కోట్లాది రూపాయల పంట నీటిపాలవుతోంది.

పంటల బీమా ఊసేది...?

-అమలు చేయడంలో సర్కారు ఉదాసీనత

-ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న అన్నదాత

-అకాల వర్షాలతో ధ్వంసమైన పంటలు

-రూ.10 వేల నష్టపరిహారానికీ నోచుకోని రైతులు..!

మంచిర్యాల, మే 14 (ఆంధ్రజ్యోతి): ఉచిత పంటల బీమా పథకం అమలులోలేక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట లు ప్రకృతి వైపరీత్యాల కారణంగా తుడిచిపెట్టుకు పోతున్నా ఆదుకొనేవారు కరువయ్యారు. జిల్లాలో ఏటా ఆకాల వర్షాలు, వడగళ్ల వానలతో కోట్లాది రూపాయల పంట నీటిపాలవుతోంది. గతంలో పంటల బీమా పథ కం అమలులో ఉన్నప్పుడు ఆలస్యంగా అయినా న ష్టపరిహారం అంది కొంతమేరైనా ఉపశమనం లభించే ది. నాలుగేళ్లుగా పంటల బీమా పథకం అమలు కావ డం లేదు. దీంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్పుడల్లా రైతులు నిలువునా మునిగిపోతున్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఉచిత పంటల బీమా పధకాన్ని పునరుద్ధరించడంలో రాష్ట్రప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. 2024 వానాకాలం సీజన్‌ నుంచే పంటల బీమాను పునరుద్ధరించనున్నట్లు చెప్పి న ప్రభుత్వం... 2024 వానాకాలం, 2024-25 యాసంగి పంట కాలాల్లోనూ పంటల బీమాను అమలు చేయలే దు. ఇప్పుడు తాజాగా 2025 వానాకాలం నుంచి అమ లు చేస్తామని చెబుతోంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వ చ్చి ఏడాది దాటినా ఇప్పటి వరకు పంటల బీమాపై విధివిధానాలను ఖరారు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యవసాయ శాఖ అధికారులకు ఎలాంటి ఆదే శాలు రాకపోవడంతో ఈ సీజన్‌లో కూడా పథకం అ మలు అయ్యే అవకాశాలు కానరావడంలేదు.

ఫసల్‌ బీమా యోజన ద్వారా....

ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పధకాన్ని రాష్ట్రంలో 2018-19 సీజన్‌ వరకు అమలుచేసి, నిలిపివే శారు. ఇదివరకు వివిధ పంటలకు బీమా చేసేందుకు నోటిఫికేషన్‌ వెలువరించి రైతుల నుంచి ప్రీమియం తీసుకునేవారు. వరికి గ్రామం యూనిట్‌గా, మొక్కజొ న్న, కంది, పెసర, మినుము, సోయా, పసుపు, వేరుశన గ, నువ్వుల పంటలకు మండలం యూనిట్‌గా బీమా వర్తింపజేసేవారు. వాతావరణ ఆధారిత బీమా పరిధి లో వానా కాలం మిరప, పత్తి, యాసంగిలో మామిడి పంటలుండేవి. బ్యాంకుల నుంచి రైతులు పంట రుణం తీసుకునే సమయంలోనే వానాకాలం సీజన్‌కు 2 నుం చి 5 శాతం, యాసంగిలో 1.5 నుంచి 5 శాతం ప్రీమి యం బ్యాంకర్లు తప్పనిసరిగా మినహాయించి బీమా ప్రీమియం కంపెనీకి చెల్లించేవారు. రైతులు చెల్లించిన కిస్తీ మొత్తంతో సమానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిగిలిన సగం ప్రీమియం రైతు రాయితీగా కంపెనీకి చెల్లించేవి. కానీ కిస్తీ చెల్లింపును రైతుల ఇష్టానుసారం చేయడం, రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు వెలువరిం చక పోవడంతో పంటల బీమా పథకం కొన్నేళ్లుగా ని లిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కిస్తే చెల్లించి బీమాను వెంటనే అమలులోకి తేవాలని రైతులు కోరుతున్నారు.

అటకెక్కిన హామీ...

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిపెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) లో చేరడంతో పాటు పంటల బీమా కోసం రైతుల వాటా ప్రీమియం కూడా చెల్లిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పసల్‌ బీమా యోజనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కొత్త గా తీసుకుంటున్న పంటల బీమా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కొంత మేర కసరత్తు చేసినా.... ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని పక్కనబెట్టింది. వాస్తవానికి గత వానాకాలంలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. టెండర్లను ఏక మొత్తంగా కాకుండా క్లస్టర్ల వా రీగా పిలవాలని వ్యవసాయశాఖ నిర్ణయించినట్లు స మాచారం. పీఎంఎఫ్‌బీవై మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వంటల బీమా పథకాన్ని అం దుబాటులోకి తేవాలనుకున్న నేపథ్యంలో ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంది. అయితే టెండర్ల ప్రక్రియ పూర్తయితేనే నిధులపై స్పష్టత వస్తుంది. రా ష్ట్రం వాటా చెల్లించిన తర్వాతే కేంద్రం వాటా జమ చే స్తుంది. ఉచిత పంటల బీమా పథకం అమలు కోసం బీమా కంపెనీలతో ఒప్పందాలు, ప్రీమియం నిర్ధారణ కోసం రాష్ట్రస్థాయిలో అధికారులు చర్చలతోనే సరిపె ట్టారు. పంటల బీమాకు సంబంధించి కేంద్ర పథకం ఫసల్‌ బీమా యోజన రాష్ట్రంలో ఇంకా అమల్లోకి రా నందున రాష్ట్ర బడ్జెట్‌ నుంచే నష్టపరిహారం ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. అయిన ఇప్పటివరకు ఆచరణ కు నోచుకోలేదు. ఈ యాసంగి సీజన్‌లో ఆకాల వర్షం తో జిల్లాలో వేల ఎకరాల్లో పంట నష్టం జరుగగా, నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు.

యూనిఫైడ్‌ ప్యాకేజీ అమలుకు....

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బీమా తక్షణ అమలు తో పాటు కేంద్ర ప్రభుత్వ యూనిఫైడ్‌ ప్యాకేజీ పథ కాన్ని అమలు చేయాలని అన్నదాతలు అభ్యర్థిస్తున్నా రు. యూనిఫైడ్‌ ప్యాకేజీ వల్ల పంటల బీమా చేసిన రైతు ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో అతని కుటుంబానికి రూ. 2 లక్షల పరిహారం, అంగవైకల్యం పొందితే రూ.లక్ష, పాక్షిక వైకల్యానికి రూ.లక్ష పరిహా రంగా చెల్లిస్తారు. కుటుంబ పెద్ద మరణించినప్పుడు చదువుకుంటున్న అతని పిల్లలకు ఆర్థిక సాయం అం దించడం, ఇళ్లు నష్టపోయినా, ట్రాక్టర్‌, పంపుసెట్‌కు నష్టం వాటిల్లినా బీమా పరిహారాన్ని మంజూరు చేస్తా రు. దీన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో వానాకాలం సీజ న్‌లో సాగయ్యే పంటలకు సర్వే నెంబర్లు లేదా కమతం వారీగా పంటల బీమా అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.

పత్తాలేని రూ.10 వేల పరిహారం..?

ఆకాల వర్షాలు, ఈదురు గాలులు, వడగండ్లతో పం టలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొ ప్పున పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ యించినప్పటికీ అది కూడా అమలుకు నోచుకోవడం లే దు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల కార ణంగా కల్లాల్లో వేలాది ఎకరాల ఆరబోసిన ధాన్యం త డిసి ముద్దయింది. మామిడి తోటలు అక్కరకు రాకుం డా పోయాయి. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్ట పో యారు. పంటల బీమా అమలులో లేకపోవడంతో న ష్టపరిహారం అందే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం చె ల్లిస్తానన్న ఎకరాకు రూ. 10 వేల నష్ట పరిహారం కూ డా రెండేళ్లుగా అందడం లేదు. దీంతో రైతులు రెండు విధాలుగా నష్టపోతున్నారు.

Updated Date - May 14 , 2025 | 11:56 PM