Share News

రూ. లక్ష కోట్లతో అభివృద్ధి ఏమైంది ?

ABN , Publish Date - May 20 , 2025 | 11:27 PM

రూ. లక్ష కోట్లతో పాలమూరు జిల్లా ను అభివృద్ధి చేస్తామన్న మాట ఏమైందని బీజేపీ నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పోతుగంటి భరత్‌ ప్రసాద్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.

రూ. లక్ష కోట్లతో అభివృద్ధి ఏమైంది ?
ముఖ్యనాయకుల సమావేశంలో మాట్లాడుతున్న భరత్‌ ప్రసాద్‌

అచ్చంపేటటౌన్‌, మే 20 (ఆంధ్రజ్యోతి) : రూ. లక్ష కోట్లతో పాలమూరు జిల్లా ను అభివృద్ధి చేస్తామన్న మాట ఏమైందని బీజేపీ నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పోతుగంటి భరత్‌ ప్రసాద్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. మంగళవారం పట్టణంలోని ఆయన నివా సంలో ఏర్పాటుచేసిన ము ఖ్య నాయకుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌తో కలిసి భరత్‌ ప్ర సాద్‌ మాట్లాడారు. ఇందిర గిరిజల వికాసం ప థకం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పీఎం సూర్యఘర్‌ సౌర పథకమేనన్నారు. నిజంగా న ల్లమల ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధి ఉంటే నల్లమలలో ప్రాజెక్టుల ప్రస్తావన ఎందుకు చే యలేదని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఆపరేషన్‌ సిందూర్‌తో భారతసైన్యం చూపెట్టిన పరాక్రమాన్ని, దైర్యసాహసాలను కీర్తిస్తూ ఈ నెల 23న నిర్వహించే తిరంగా యాత్రలో కుల, మతాలకు అతీతంగా నాయకులు, పెద్దలు పా ల్గొనాలని కోరారు. కార్యక్రమంలో పార్లమెంట్‌ కన్వీనర్‌ రామకృష్ణారెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి గంగిశెట్టి నాగరాజు, నాయకులు ముక్తాల రేణ య్య, శ్రీను నాయక్‌, సైదులు యాదవ్‌, బల్మూరి జానకి, మండలాల అధ్యక్షుడు నీలం రవి, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2025 | 11:27 PM