Share News

kumaram bheem asifabad- కౌలు రైతుకు గుర్తింపేది?

ABN , Publish Date - Jun 24 , 2025 | 10:45 PM

సొంత భూములు లేక కౌలుపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులను ఏళ్ల తరబడి ప్రభుత్వాలు గుర్తించడం లేదు. పంటసాగు పెట్టుబడి కోసం ప్రభుత్వం నుంచి సాకారం అందక, పండించిన పంట అధికారికంగా అమ్ముకోలేక నానా ఇబ్బందులు పడు తున్నారు. గత ప్రభుత్వంలో వందల ఎకరాలు కల్గిన భూస్వాములు కనీసం సాగువైపు కన్నెత్తి చూడకపోయినా రైతు భరోసా అందుతోంది.. కానీ ఆ భూమిని నమ్ముకొని కష్టపడి పనిచేసే కౌలు రైతుకు ఎక్కడా సహాయం అందలేదు.

kumaram bheem asifabad- కౌలు రైతుకు గుర్తింపేది?
వ్యవసాయ చేనులో దుక్కిదున్నుతున్న కౌలు రైతు

- పండిన పంటను అమ్ముకోవడానికి అవస్థ్థలు

- సీజన్‌లో ఎరువుల కోసం తిప్పలు

- రుణాలు అందక ప్రైవేటుగా అప్పులు

ఆసిఫాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): సొంత భూములు లేక కౌలుపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులను ఏళ్ల తరబడి ప్రభుత్వాలు గుర్తించడం లేదు. పంటసాగు పెట్టుబడి కోసం ప్రభుత్వం నుంచి సాకారం అందక, పండించిన పంట అధికారికంగా అమ్ముకోలేక నానా ఇబ్బందులు పడు తున్నారు. గత ప్రభుత్వంలో వందల ఎకరాలు కల్గిన భూస్వాములు కనీసం సాగువైపు కన్నెత్తి చూడకపోయినా రైతు భరోసా అందుతోంది.. కానీ ఆ భూమిని నమ్ముకొని కష్టపడి పనిచేసే కౌలు రైతుకు ఎక్కడా సహాయం అందలేదు. దీంతో ఎందరో కౌలు రైతులు పంట చేతికి వచ్చినా..రాకున్నా ..కౌలు మాత్రం కడుతూ వస్తున్నారు. ఏటా పండిన పంటలను అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. పైౖగా వ్యవసాయమే తప్ప ఇతర పని చేయలేని కౌలు రైతులంతా ఏడాదంతా కష్టపడి పండించిన పంటను అధిక శాతం వడ్డీకి తీసుకున్న ప్రైవేటు అప్పులే తీరుస్తున్నవారు అనేకం. ఈ నేపథ్యంలో గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ కౌలు రైతులకు రైతు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ ప్రస్తుతం వానాకాలం పనులు జోరుగా సాగుతుండగా ఇంత వరకు కౌలు రైతులకు అందే సహయంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవ డంతో ఇంకా ఎప్పుడు తమకు పంట పెట్టుబడి సాయం అందుతుందోనని ఎదురుచూస్తున్నారు.

- జిల్లాలో 30 వేల వరకు..

జిల్లాలోని 15 మండలాల పరిధిలో సుమారుగా 30వేల వరకు కౌలు రైతులున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, ఇతరత్రా రంగాలకు చెందిన వారు వ్యవసాయం చేసే ఆసక్తి లేక పోవడంతో పాటు సాగు కష్టాలను ఎదర్కొనే పరిస్థితులు లేకపో వడంతో తమ భూములను కౌలుకు ఇచ్చేస్తుంటారు. గత ప్రభుత్వం రూ. 6వేల చొప్పున రెండు విడతలుగా అందించిన రైతు బంధు పథకం పట్టాదారు రైతుల ఖాతాల్లోనే జమవుతున్నది. దీంతో పంటను సాగు చేసిన కౌలు రైతు పేరే ఎక్కడా లేకుండా పోయింది. గత ప్రభుత్వం అందించిన రైతు బంధులో కౌలు రైతు ఊసే లేకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. పంటలు సాగు చేసి ఎరువులు, కలుపులు తీయాల్సిన పరిస్థితుల్లో పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొంది. బ్యాంకులు కూడా కౌలు రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. గతంలో కౌలు రైతులకు రుణ అర్హత కార్డులను జారీ చేసేవారు. కొంత కాలంగా భూములన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేసి పాస్‌ పుస్తకాల్లో పట్టాదారు పేరు మినహా ఇతర కాలం ఎక్కడా లేదు. దీంతో కౌలు రైతుల గుర్తింపునకు శాశ్వతంగా అడ్డుకట్ట పడింది.

- పెరుగుతున్న పెట్టుబడులు..

రోజురోజుకూ పంట పెట్టుబడులు పెరుగుతున్నా యి. ఒక ఎకరంలో పత్తి పంట వేయాలంటే సుమారుగా రూ. 25వేలు, వరి పొలానికి రూ. 23 నుంచి 25 వేలు, మొక్కజొన్న చేనుకు రూ. 20వేల వరకు ఖర్ఛు చేయాల్సి వస్తోంది. కౌలు డబ్బులు కాకుండా కౌలు కుటుంభీకుల కష్టం పోను విత్తనాలు, ఎరుువులకే అధిక పెట్టుబడి వెచ్చించాల్సిన పరిస్థితి. ఎంత కష్టపడినప్పటికీ ఎకరానికి 10వేల నుంచి 15వేల వరకు మిగిలే పరిస్థితి లేదు. 2018 నుంచి గత ప్రభుత్వం రైతు బంధు అమలు చేయగా,ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరానికి రూ.ఆరు వేలు పట్టాదారుల ఖాతాల్లో జమ చేస్తోంది.కాంగ్రెస్‌ ప్రభుత్వం కౌలు రైతులకు రైతు భరోసాను అమలు చేస్తామని హామీ ఇచ్చినా ఇంకా కార్యరూపం దాల్చ లేదు. దీంతో కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నా రు. కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించి ఎదో రూప కంగా ప్రభుత్వం సాయం చేయాలని చెబుతున్నారు.

- పంట విక్రయానికి సైతం..

కౌలు రైతులు తాము పండించిన పంటను అమ్ము కోవడానికి సైతం తిప్పలు పడుతున్నారు. పట్టాదారు కల్గిన రైతులే అమ్ముకోవడానికి వీలు ఉండడంతో కౌలు రైతులు పంటలను తక్కువ దరకే దళారులకు విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. కౌలు రైతులను గుర్తించి ప్రత్యేక గుర్తింపు కార్డులు అందజేసి బ్యాంకు ల నుంచి రుణాలు అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు. అలాగే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కౌలు రైతులకు రైతు భరోసా పథకం రూ. 12వేల సాయం వర్తింపజేయాలని చెబుతున్నా రు. దీంతో కొంత మేర రైతులు నష్టపోకుండా ఉంటారని. ప్రభుత్వం త్వరగా కౌలు రైతులపై విధివి ధానాలు ఖరారు చేయాలని కోరుతున్నారు.

Updated Date - Jun 24 , 2025 | 10:45 PM