Share News

kumaram bheem asifabad- పారిశుధ్యంపై పట్టింపేది?

ABN , Publish Date - Oct 24 , 2025 | 10:17 PM

బెజ్జూరు మండలంలోని ఎల్కపల్లి గ్రామంలో పారిశుధ్యం లోపించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని మురికి కాలువల్లో పూడిక పూర్తిగా నిండిపోవడంతో మురికి నీరంతా రోడ్లపై ప్రవహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామపంచాయతీల్లో పాలకవర్గాలు లేక ఎక్కడి సమస్యలు అక్కడే అన్న చందంగా మారింది

kumaram bheem asifabad- పారిశుధ్యంపై పట్టింపేది?
ఎల్కపల్లిలో మురికి కాలువల్లో నిండిన పూడిక

- మురికి కాలువల్లో నిండిన పూడిక

- పట్టించుకోని అధికారులు

బెజ్జూరు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మండలంలోని ఎల్కపల్లి గ్రామంలో పారిశుధ్యం లోపించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని మురికి కాలువల్లో పూడిక పూర్తిగా నిండిపోవడంతో మురికి నీరంతా రోడ్లపై ప్రవహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామపంచాయతీల్లో పాలకవర్గాలు లేక ఎక్కడి సమస్యలు అక్కడే అన్న చందంగా మారింది. గ్రామాల్లో ప్రత్యేకాధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే నెలకొన్నాయి. మురికి కాలువల్లో పూడిక తొలగించాలని పలుమార్లు అధికారులకు విన్నపించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో మురికి నీరంతా రోడ్లపై ప్రవహించడంతో వీధులన్ని దుర్గందం వెదజల్లుతున్నాయని గ్రామస్తులు తెలుపుతున్నారు. దీనికితోడు దోమల వ్యాప్తి కూడా విపరీతంగా పెరిగిందని ప్రజలు వాపోతున్నారు.

- పేరుకుపోతున్న చెత్తాచెదారం..

రోడ్లపై చెత్త పేరుకపోయినా కనీసం అధికారులు తొలగించడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామంలో ఎన్నో రోజుల నుంచి మురికి కాలువల్లో పూడిక నిండి దుర్గందం వస్తున్నా కనీసం వాటిపై దృష్టి సారించేవారు కరువయ్యారని ప్రజలు వాపోతున్నారు. రోడ్లపై చెత్త పేరుకపోయి రోడ్లన్ని చెత్తాచెదారంతో నిండినా గ్రామపంచాయతీ అధికారుల పట్టింపు కరువయిందని అంటున్నారు. గ్రామపంచాయతీల పదవీ కాలం పూర్తయిన నాటి నుంచి ప్రత్యేక అధికారులు గ్రామాలను సందర్శించిన దాఖలాలు లేవని తెలుపుతున్నారు. తమ గోడు ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

- పైసలు లేవు...పనులు చేయరు..

గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనందున గ్రామాల్లో సమస్యలు రాజ్యమేలు తున్నాయి. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల కోసం షెడ్యూల్‌ విడుదలైనా కోర్టు తీర్పు కారణంగా నిలిచిపోయాయి. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. స్థానిక సంస్థలకు ఎన్నికలకు జరిగితే గ్రామపంచాయతీలకు నిధులు వచ్చే అవకాశం ఉండేది. దీంతో పంచాయతీల్లో పైసలు లేక ఏ చిన్న పని కూడా కావడం లేదు. కనీసం గ్రామాల్లో వీధి దీపాలు కూడా లేవు. వాటికి కూడా పైసలు లేవని కార్యదర్శులు అంటున్నారు. దీంతో తాము ఎక్కడి నుంచి తీసుకరావాలని ప్రశ్నిస్తు న్నారు. విదిలేక వారు కూడా ఏం చేయలేకపో తు న్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయని కార ణంగా ఏపని చేయలేకపోతున్నామని కార్యదర్శులు వాపోతున్నారు.

Updated Date - Oct 24 , 2025 | 10:17 PM