kumaram bheem asifabad-అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలి
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:01 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన గిరిజనులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు . జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మంగళవారం దర్తీ అభ జన్ జాతీయ గ్రామ్ ఉత్సక్ష అభియాన్, ఆది ఖర్మ యోగి అభియాన్ కార్యక్రమంలో భాగంగా సంబంధిత శాఖల అధికారులు, జిల్లా స్థాయి మాస్టర్ టైనర్లతో నిర్వహించిన సమావేశానికి హాజర య్యారు.
ఆసిఫాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన గిరిజనులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు . జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మంగళవారం దర్తీ అభ జన్ జాతీయ గ్రామ్ ఉత్సక్ష అభియాన్, ఆది ఖర్మ యోగి అభియాన్ కార్యక్రమంలో భాగంగా సంబంధిత శాఖల అధికారులు, జిల్లా స్థాయి మాస్టర్ టైనర్లతో నిర్వహించిన సమావేశానికి హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి జుగా పథకంలో భాగంగా ఆధి కర్మ యోగి కార్యక్రమాల ద్వారా జిల్లాలో 12 మండలాల పరిధిలోని 102 గ్రామాలలో ఉన్న గిరిజనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ పథకాలు ప్రతి గిరిజన కుటుంబానికి చేరే విధంగా బ్లాక్ స్థాయి(మండల) మాస్టర్ టైనర్లు, గ్రామ స్థాయి శిక్షకులు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. మిషన్ భగీరథ, గిరిజన సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, వైద్య, ఆరోగ్య, అటవీ, విద్య, శిశు సంక్షేమ శాఖల నుంచి బ్లాక్ స్థాయి టైనర్లు, పంచాయతీ స్థాయి సిబ్బందిని ఎంపిక చేయాలని చెప్పారు. శిక్షణ పూర్తి అయిన అనంతరం జిల్లాలోని 12 మండలాలలో గల 102 గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. ప్రతి గ్రామంలో నిర్వహించే గ్రామ సభలో గ్రామాలలో పని చేసే ప్రతి శాఖకు సంబంధించిన సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామసభకు ముఖ్యంగా పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య, గ్రామీణాభివృద్ధి, విద్యుత్, విద్యా శాఖాధికారులు తప్పని సరిగా హాజరు కావాలని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధికారులు, సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, ఇజల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేషరావు, పంచాయతీ రాజ్ ఈఈ కృష్ణ, మిషన్ భగీరథ ఈఈ సిద్దిక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సీతారాం, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజేశ్వర్‌జోషి, జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వహణ అధికారి లక్ష్మినారాయణ, పర్యటక శాఖ అధికారి అశోక్, మాస్టర్ టైనర్లు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఎరువులు, మందులను అధిక ధరలకు విక్రయిస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీనివాస ఫర్టిలైజర్ దుకాణాన్ని తనిఖీ చేశారు. రిజిస్టర్టలను, ఈ -పాస్ యంత్రం, ధరల పట్టిక, స్టాక్ నిలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు అడిగిన మందులను నిర్ణీత ధరలకు మాత్రమే విక్రయించాలని అదనంగా మందులు విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కొనుగోలు చేసిన అంశాలను సంబంధించిన రైతులకు నగదు రసీదును అందించాలని తెలిపారు. జిల్లాలో యూరియా నిలువలు సమృద్దిగా ఉన్నాయని, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులు వ్యవసాయాధికారులు అందించే సూచనలు పాటిస్తూ పంట మెలకువలు తెలుసుకుని యూరియా, ఇతర మందులను మోతాదు ప్రకారం పిచికారి చేయాలని చెప్పారు. అధిక దిగుబడి పొందాలని తెలిపారు. మందులను మోతాదుకు మించి వినియోగించకూడదని మందులు కొనుగోలు చేసిన రసీదులను రైతులు జాగ్రత్తగా భద్రత పర్చుకోవాలని తెలిపారు. రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం యూరియా విత్తనాలు, మందులను సాగుకు అనుకూలంగా పంపిణీ చేస్తుందని, రైతులు అవకాశాన్ని వినియోగించుకుని పంట సాగు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమం ఏడీఏ మిలింద్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.