Share News

సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలి

ABN , Publish Date - Jun 24 , 2025 | 11:18 PM

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి రామకృష్ణారావు పేర్కొన్నారు. మంగళవారం హైద్రాబాద్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను కేటాయించామని, ఇందులో భాగంగా అర్హులైన లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేశామన్నా రు.

 సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలి
వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, అధికారులు

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి రామకృష్ణారావు పేర్కొన్నారు. మంగళవారం హైద్రాబాద్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను కేటాయించామని, ఇందులో భాగంగా అర్హులైన లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేశామన్నా రు. భారీ వర్షాలు కాకముందే నిర్మాణ పనులు జరిగేలా అధికారులు చూడాలన్నారు. ఇ సుకను ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. అలాగే వన మహోత్సవంలో ప్రజలను భాగస్వాములను చేయాలని మొక్కలు నాటే కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయా లన్నారు. మండల ప్ర త్యేకాధికారులు ఫెర్టిలైజర్‌ దుకాణాలను సందర్శించి ఎరువులు, విత్తనాల నిల్వలు, విక్రయాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదయ్యేలా చూడాలన్నారు. భూ భారతి సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 15 నాటికి పరిష్కరించాలన్నారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులను నియంత్రించేందుకు వైద్య ఆరోగ్య శాఖ తగిన చర్యలు చేపట్టాలన్నారు. డ్రైడే ప్రైడే కార్య క్రమాలను నిర్వహించాలన్నారు. విష జ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు తగు చర్యలు తీసుకో వాలన్నారు. టీబీ ముక్త్‌ భారత్‌లో బాగంగా ప్రభావిత ప్రాంతాల్లో వంద రోజులు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన పరీక్షలు చేయాలన్నారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుకను అందిస్తున్నామన్నా రు. భూ బారతి సదస్సుల్లో అందిన దరఖాస్తులను క్షేత్రస్ధాయిలో పరిశీలించి పరిష్కరించేం దుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వానాకాలం సీజన్‌ వ్యాధుల నివారణకు చర్యలు తీ సుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి శివ్‌ఆశిష్‌సింగ్‌, డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్‌, డీఆర్‌డీవో కిషన్‌, జిల్లా వ్యవసాయాధికారి కల్పన, మున్సిపల్‌ కమీషనర్‌ శివాజీ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 11:18 PM