అర్హులకే సంక్షేమ పథకాలు
ABN , Publish Date - May 26 , 2025 | 10:59 PM
రాష్ట్రంలో అర్హులకే సంక్షేమ పథ కాలను తమ ప్రభుత్వం అందిస్తుందని, సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు వెళ్తుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెం కటస్వా మి తెలిపారు.
-ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి
మందమర్రిటౌన్, మే 26 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో అర్హులకే సంక్షేమ పథ కాలను తమ ప్రభుత్వం అందిస్తుందని, సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు వెళ్తుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెం కటస్వా మి తెలిపారు. సోమవారం మందమర్రిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో తమ 15 నెలల పాలనకు చాలా తేడా ఉందన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం కోలుకోలేని విధంగా దె బ్బతిందని, ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తమైందని, అప్పుల కుప్పగా మార్చారన్నా రు. అయినా సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తూ ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గంలో 3 వే ల మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేశామన్నారు. అర్హులైన వారందరికి గృహాలు వస్తాయని, అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు. రా ష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు చాలా మంది రైతులు నష్టపో యా రని, చేతికి వచ్చిన పంట తడిసి ముద్ద అయ్యిందని తెలిపారు. తడిసిన ధా న్యాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తామన్నారు. నియోజకవర్గంలో అమృత పథకం కింద వంద కోట్లు కేటాయించామన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు నోముల ఉపేందర్‌గౌడ్, సుద ర్శన్, దుర్గం నరేష్, బండి సదానందం, రమేష్, తిరుమల్ పాల్గొన్నారు.
ఫమందమర్రి మున్సిపల్ కమిషనర్ రాజలింగు కుమారుడు సుహాస్ వి వాహం మూడు రోజుల క్రితం జరగగా సోమవారం స్ధానిక పాత బస్టాం డ్‌లోని కమిషనర్ నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆశీర్వదించారు.