గడపగడపకు సంక్షేమ పథకాలు
ABN , Publish Date - Jul 01 , 2025 | 11:07 PM
డప గడపకు సంక్షేమ పథకా లు అందుతున్నాయని పార్లమెంట్ నియోజక వర్గ ఇన్‌చార్జి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లయ్య అన్నారు.
- పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లయ్య
అచ్చంపేట, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : గడప గడపకు సంక్షేమ పథకా లు అందుతున్నాయని పార్లమెంట్ నియోజక వర్గ ఇన్‌చార్జి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాలలో ప్రతీ ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఈ నెల 4న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న కాంగ్రెస్‌పార్టీ గ్రామ కమిటీల అధ్య క్ష, కార్యదర్శులకు జరిగే సమావేశానికి నియోజ కవర్గంలోని అన్ని గ్రామల నుంచి పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ శ్రీనివాసులు, ఉమామహేశ్వర ఆలయ చైర్మన్ మాధవరెడ్డి, నాయకులు గోపాల్‌రెడ్డి, అనంత రెడ్డి, సోమ్లా, రాఘవులు, ఖాదర్, బాలరాజు, మహబూబ్ అలీ పాల్గొన్నారు.