Share News

అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు

ABN , Publish Date - Aug 09 , 2025 | 11:49 PM

అర్హులైన ప్రతీ ఒ క్కరికి సంక్షేమ పథకాలు అందు తాయని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు.

అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు
లబ్ధిదారులకు రేషన్‌ కార్డు మంజూరు పత్రాలను అందజేస్తున్న ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : అర్హులైన ప్రతీ ఒ క్కరికి సంక్షేమ పథకాలు అందు తాయని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సాయిగార్డెన్స్‌లో శనివారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధి దారులకు ఆహార భద్రత పథకం కింద కొత్త రేషన్‌కార్డు మంజూరు పత్రాలు ఎమ్మెల్యే, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌లు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలోని ప్రభుత్వం పదేళ్లలో ఒక్క కొత్త రేషన్‌కార్డు కూడా జారీ చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వినోద్‌, అసెంబ్లీ ప్రెసిడెంట్‌ తిరుపతిగౌడ్‌, ప్రజా ప్రతినిధులు, అధికారులు, బ్లాక్‌ అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు, మండల కాంగ్రెస్‌ నాయకులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, లబ్ధిదారులు అఽధిక సంఖ్యలో హాజయ్యారు.

Updated Date - Aug 09 , 2025 | 11:50 PM