Share News

అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు

ABN , Publish Date - Sep 22 , 2025 | 11:00 PM

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మ పథకాలు అర్హత గల ప్రతి లబ్ధిదారుడికి అందేలా అధికార యంత్రాంగం సమన్వ యంతో చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార,గనుల భూగ ర్భ శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. సోమవారం చెన్నూరు పట్టణంలో ని క్యాంపు కార్యాయలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.

అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు
చెన్నూరులో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తున్న మంత్రి వివేక్‌వెంకటస్వామి, కలెక్టర్‌ కుమార్‌దీపక్‌

చెన్నూరు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మ పథకాలు అర్హత గల ప్రతి లబ్ధిదారుడికి అందేలా అధికార యంత్రాంగం సమన్వ యంతో చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార,గనుల భూగ ర్భ శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. సోమవారం చెన్నూరు పట్టణంలో ని క్యాంపు కార్యాయలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ని రుపేదలందరికీ గూడు కల్పించే ఉద్దేశ్యంతో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిర మ్మ ఇళ్ల చొప్పున అందించామన్నారు. డిసెంబరు తర్వాత చెన్నూరు నియోజకవర్గాని కి 3,500 ఇళ్లను కేటాయించి అర్హత గల లబ్దిదారులకు అందించేందుకు చర్యలు తీసు కుంటామన్నారు. సోమనపల్లి గ్రామంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలను ఏర్పా టు చేస్తున్నామని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నామ న్నారు. చెన్నూరు పట్టణంలో 6 పడకలుగా ఉన్నడయాలసిస్‌ సెంటర్‌ను 10 పడక లుగా అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం మండలంలోని 78 మంది లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి కళ్యాణలక్ష్మీ,షాదిముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ మల్లికార్జున్‌, మున్సిపల్‌ కమీషనర్‌ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కార్మికులకు 34 శాతం లాభాల బోనస్‌ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే

సింగరేణి కార్మికులకు 34 శాతం లాభాల బోనస్‌ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదే నని మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సింగరేణి బొగ్గు గ నులను ఆక్షన్‌లో పాల్గొనకుండా గత ప్రభుత్వం అడ్డుకుందని , ఈ కారణంతో గత మూడేళ్ల నుంచి కొత్త గనులు రాలేదన్నారు. కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా ఎ ప్పుడూ చెల్లించలేదని కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ. 5,500 చెల్లిస్తుందన్నారు. సిం గరేణిలో ప్రమాదవశాత్తూ ఎవరైనా చనిపోతే కోటి రూపాయల పరిహారం అందిం చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నియోజకవర్గంలో సుమారు 4 వేల టన్నుల యూరియా ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే కాళేశ్వరం బ్యాక్‌ వాటర్‌తో పంట పొలాలు మునుగుతున్నాయన్నారు. పంట పొలాలు మునుగు తున్నందున బాల్క సుమన్‌ వెళ్లి కేటీఆర్‌ ఇంటి ముందు ధర్నా చేయాలన్నారు. బీ ఆర్‌ఎస్‌, బీజేపీ తోడు దొంగలని పేర్కొన్నారు.

Updated Date - Sep 22 , 2025 | 11:00 PM