సంక్షేమం, అభివృద్ధే మా లక్ష్యం
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:38 PM
సంక్షే మం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కొనసాగు తున్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు.
- కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) : సంక్షే మం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కొనసాగు తున్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. పనుల జాతర కార్యక్రమంలో భాగంగా కల్వకుర్తి మండలం యంగంపల్లి టు జిల్లెల సీఆర్‌ఆర్ రూ.2కోట్ల నిధులతో నిర్మించే బీటీరోడ్డు నిర్మాణానికి జీడిపల్లితండాలో అంగన్ వాడీ కేంద్రం, వెంకటాపూర్‌తండాలో గ్రామపం చాయతీ భవనానికి భూమి పూజ చేశారు. కార్య క్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు ఠాకూర్ బాలాజీసింగ్, కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్‌కుమార్, కల్వకుర్తి తహసీల్దార్ ఇబ్రహీం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పసుల రమాకాం త్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
గ్రామాలభివృద్ధికి పెద్దపీట
వెల్దండ : గ్రామీణ ప్రాంతాల అ భివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మె ల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో అంగన్ వాడీ భవనంతో పాటు కంటోనిపల్లిలో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనానికి శంకు స్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్యమన్నా రు. పని చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా ని లవాలన్నారు. కార్యక్రమంలో అధికారులు కార్తీక్ కుమార్, సత్యపాల్‌రెడ్డి, చంద్రుడు నాయ క్, చంద్రశేఖర్, నర్సిరెడ్డి పాల్గొన్నారు.