MBBS Admissions,: ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు నేటి నుంచి వెబ్ ఆప్షన్స్
ABN , Publish Date - Sep 16 , 2025 | 06:02 AM
రాష్ట్రంలో యూజీ వైద్య విద్యలో మొదటి విడత కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ వర్సిటీ
హైదరాబాద్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యూజీ వైద్య విద్యలో మొదటి విడత కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు, అన్ ఎయుడెడ్ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలని పేర్కొంది. అలాగే తుది అర్హుల జాబితాను విడుదల చేసింది. ఇందులో పేర్లున్న అభ్యర్థులు మంగళవారం (ఈ నెల 16న) నుంచి ఈ నెల18 రాత్రి 11.30 గంటల వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించింది. హెల్త్ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లోని వైద్య కళాశాలల జాబితాను చూసి ఎంపిక చేసుకోవాలని కోరింది. ప్రభుత్వ పరిధిలోని 35 వైద్య కళాశాలల్లో సీట్లను కన్వీనర్ కోటా ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రైవేటు కళాశాలల్లోని మొత్తం సీట్లలో 50 శాతాన్ని ఈ కోటా ద్వారా వర్సిటీ భర్తీ చేస్తుంది. అలాగే నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ర్టేషన్ ప్రక్రియకు హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. టీజీఎ్‌పసెట్-2025లో క్వాలిఫై అయిన అభ్యర్థులు 16 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలని కోరింది.