Share News

ఓల్డ్‌ పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లో ఆయుధ పూజ

ABN , Publish Date - Sep 30 , 2025 | 11:14 PM

జిల్లా కేంద్రంలోని ఓల్డ్‌ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో మంగళవారం నిర్వహిం చిన ఆయుధ (వాహన) పూజ కార్యక్రమంలో ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ పాల్గొన్నారు.

ఓల్డ్‌ పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లో ఆయుధ పూజ
ఆయుధ పూజలో పాల్గొన్న ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, ఏఎస్పీ, డీఎస్పీ

కందనూలు, సెప్టెంబ రు 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని ఓల్డ్‌ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో మంగళవారం నిర్వహిం చిన ఆయుధ (వాహన) పూజ కార్యక్రమంలో ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ పాల్గొన్నారు. అడిషనల్‌ ఎస్పీ వెంకటే శ్వర్లు, డీఎస్పీ శ్రీనివాస్‌తో పాటు దాదాపు 100 మంది సిబ్బంది పాల్గొని వాహన పూజా కార్యక్రమం నిర్వహించారు. వి జయదశమి పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ కోరారు.

ఎస్‌ఐ మాణిక్యనాయక్‌కు సన్మానం

నాగర్‌కర్నూల్‌క్రైం, సెప్టెంబరు30 (ఆంధ్రజ్యో తి) : జిల్లాలో స్పెషల్‌ బ్రాంచ్‌లో ఎస్‌ఐగా పని చేస్తూ పదవీ విరమణ పొందిన ఎస్‌ఐ మాణి క్యనాయక్‌ను ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ మంగళవారం ఘనంగా సన్మానించారు. ఎస్పీ మాట్లాడుతూ మాణిక్య నాయక్‌ 42 సంవత్స రాలు సర్వీస్‌ను మంచిగా పూర్తి చేసుకుని ఆరో గ్యంగా ఉన్నారని, ఇకముందు కూడా ఆయురా రోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాం క్షించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ ఎన్‌. వెంకటే శ్వర్లు, ఏవో కృష్ణయ్య, పోలీస్‌ వెల్ఫేర్‌ అ సోసి యేషన్‌ అధ్యక్షుడు గుణవర్ధన్‌, కుటుంబ సభ్యులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2025 | 11:14 PM