Share News

Minister Komatireddy: రాష్ట్రాభివృద్ధికి కేంద్రంతో కలిసి పని చేస్తాం

ABN , Publish Date - Dec 17 , 2025 | 05:40 AM

రాజకీయ పార్టీ నేపథ్యం వేరైనా రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి చెప్పారు....

Minister Komatireddy: రాష్ట్రాభివృద్ధికి కేంద్రంతో కలిసి పని చేస్తాం

హైదరాబాద్‌, డిసెంబర్‌ 16 (ఆంధ్రజ్యోతి): రాజకీయ పార్టీ నేపథ్యం వేరైనా రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. 19,20 తేదీల్లో ఢిల్లీలో కేంద్ర రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆధ్వర్యంలో ‘జాతీయ చింతన్‌ శిబిరం-2025’ జరుగనున్నది. ఈ సమావేశానికి రావాలని గడ్కరీ పంపిన ఆహ్వానంపై మంత్రి కోమటి రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాఖ్య స్ఫూర్తిని పెంచుతుందని పేర్కొన్నారు. జఠిలమైన సమస్యలకూ కేంద్ర, రాష్ట్రాల మధ్య చర్చలు, సమన్వయంతో పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ విజన్‌-2047 లక్ష్యాలకు చేరుకోవడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కీలకమని కోమటి రెడ్డి చెప్పారు.

Updated Date - Dec 17 , 2025 | 05:40 AM