Share News

kumaram bheem asifabad- క్రీడల అభివృద్ధికి కృషి చేస్తాం

ABN , Publish Date - Jul 13 , 2025 | 10:44 PM

జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడు కోట్నాక విజయ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని క్రీడా పాఠశాలలో అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ఎన్నికలకు పరిశీలకునిగా తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ పరధాన కార్యదర్శి సారంగపాణి, ఎన్నికల అధికారిగా వెంకటేశ్వరరెడ్డి, బండ మీనారెడ్డి వ్యవహరించారు.

kumaram bheem asifabad- క్రీడల అభివృద్ధికి కృషి చేస్తాం
మాట్లాడుతున్న అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కోట్నాక విజయ్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడు కోట్నాక విజయ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని క్రీడా పాఠశాలలో అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ఎన్నికలకు పరిశీలకునిగా తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ పరధాన కార్యదర్శి సారంగపాణి, ఎన్నికల అధికారిగా వెంకటేశ్వరరెడ్డి, బండ మీనారెడ్డి వ్యవహరించారు. అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా కోట్నాక విజయ్‌, చీఫ్‌ పాట్రన్‌గా సట్ల శంకర్‌, ఉపాధ్యక్షులుగా పుర్క ఉద్దవ్‌, కృష్ణమూర్తి, శ్రీనివాస్‌, లక్ష్మి, సుభాష్‌, కార్యదర్శిగా గుండా లక్ష్మణ్‌, జాయింట్‌ సెక్రెటరీగా స్వప్న, ప్రవీణ్‌, హరికృష్ణ, తులసీదాస్‌, రవీందర్‌, కోశాధికారిగా మంగపతి, ఈసీ మెంబర్‌గా జంగు, సాయిబాబా, యాదగిరి, బారిక్‌రావు, విజయలక్ష్మి, చిన్నక్కలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన అధ్యక్షుడు కోట్నాక విజయ్‌ మాట్లాడుతూ జిల్లాలో క్రీడల అభివృద్ధి కోసం, క్రీడాకారుల సంక్షేమం కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు. అధ్యక్షుడిగా రెండో సారి అవకాశం ఇవ్వడం మరింత బాధ్యతలు పెంచిందని తెలిపారు. కార్యక్రమంలో క్రీడా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జంగు, ఆదిలాబాద్‌ జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ సెక్రెటరీ రాజేష్‌, తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ కాంపిటేషన్‌ సెక్రెటరీ వాసుదేవరావు, జనగాం జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ చంద్రశేఖర్‌రెడ్డి, క్రీడా కోచ్‌లు విద్యాసాగర్‌, అరవింద్‌, తిరుమల్‌, రవి, సీనియర్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2025 | 10:44 PM