Share News

గ్రామాభివృద్ధికి అడ్డుపడితే తాట తీస్తాం

ABN , Publish Date - Sep 30 , 2025 | 11:12 PM

గ్రామాల అభివృద్ధే ధ్యేయమని, ఎవరైనా అడ్డుపడితే తాట తీస్తామని స్థానిక ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి అన్నారు.

గ్రామాభివృద్ధికి అడ్డుపడితే తాట తీస్తాం
మదనపురంలో కాంగ్రెస్‌ జెండా ఆవిష్కరణలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేష్‌ రెడ్డి

- ఎమ్మెల్యే రాజేష్‌ రెడ్డి

తెలకపల్లి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల అభివృద్ధే ధ్యేయమని, ఎవరైనా అడ్డుపడితే తాట తీస్తామని స్థానిక ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మదనపురం గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే కాంగ్రెస్‌ జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పదేళ్లుగా ఈ గ్రామానికి ఎటువంటి అభివృద్ధి జరగలేదని, ప్రజలు ఎన్నో ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని అన్నా రు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన 20 నెల ల్లోనే గ్రామాల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు కేటాయించామని తెలిపారు. నియోజ వర్గానికి ఇప్పటివరకు దాదాపు రూ. 1000 కో ట్లు కేటాయించినట్లు తెలిపారు. డాక్డర్‌ మెత్తగా ఉన్నోడు, ఏం చేస్తాడు అని కొందరు అనుకు న్నా నేను కేవలం అభివృద్ధి గురించే ఆలోచి స్తాను మా కార్యకర్తలైనా, నాయకులైనా అభివృద్ధి విషయంలో ఎవరైనా అడ్డుపడితే తాటా తీస్తానని అని ఘాటుగా హెచ్చరించారు. ప్రజల అభివృద్ధి గ్రామాల ప్రగతి పట్ల ఎప్పు డూ కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇ చ్చారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు, మాజీ ఎంపీపీ బండ పర్వతా లు, మాజీ సర్పంచ్‌ వంశవర్ధన్‌రావు, రమణగౌ డ్‌, నాగేశ్వర్‌రావు, మాజీ ఎంపీటీసీ ఈశ్వరయ్య పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2025 | 11:13 PM