Share News

ప్రజలతో కలిసి అడ్డుకుంటాం

ABN , Publish Date - Aug 28 , 2025 | 11:34 PM

ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో గురు వారం జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టా రు.

ప్రజలతో కలిసి అడ్డుకుంటాం
కొల్లాపూర్‌లో వినతిపత్రం అందజేస్తున్న బీజేపీ నాయకులు

- కాంగ్రెస్‌ నాయకులను హెచ్చరించిన బీజేపీ నాయకులు

-వివిధ ప్రాంతాల్లో నాయకుల నిరసన

కొల్లాపూర్‌/ వంగూరు/ వెల్దండ/ చారకొం డ/ తిమ్మాజిపేట, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి) : ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో గురు వారం జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టా రు. పలు తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధ ర్నా నిర్వహించారు. తహసీల్దార్లు, ఇతర అధికా రులకు వినతిపత్రాలు అందజేశారు. ఆరు గ్యా రెంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్‌ నాయ కులను గ్రామాల్లో తిరగనివ్వబోమని పలువురు బీజేపీ నాయకులు హెచ్చరించారు. కల్యాణ లక్ష్మీ పథకంలో తులం బంగారం, వృద్ధులకు పింఛన్ల పెంపు, మహిళలకు ప్రతీ నెల రూ.2500 భరోసా ఇస్తామన్న హామీలు మరిచారనిరని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెబు తారని అన్నారు.

కొల్లాపూర్‌లో బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సం దు రమేష్‌, జిల్లా నాయ కులు సాయికృష్ణగౌడ్‌, మండల అధ్యక్షుడు కేతూ రి నారాయణ, ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ గోవింద్‌రెడ్డికి అందజేశారు. ఫ వంగూరు, చారకొండ మండ లాల్లో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురా లు బల్మూరి జానకి, పార్టీ వంగూరు మండల అధ్యక్షుడు గున్న ఆనంద్‌రెడ్డి, చారకొండ మండ ల అధ్యక్షుడు చలమోని కృష్ణ ఆధ్వర్యంలో తహ సీల్దార్‌ కార్యాలయాల్లో అధికారులకు వినతిప త్రం అందజేశారు. ఫ తిమ్మాజిపేటలో బీజేపీ మండల అధ్యక్షుడు యశ్వంత్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం దగ్గర ఆందోళన చేపట్టి, డిప్యూ టీ తహసీల్దార్‌ జ్యోతికి వినతి పత్రం అందజే శారు. బీజేపీ నాయకులు నాగేందర్‌గౌడ్‌, బాల్‌ రెడ్డి, కృపానందం, జట్టి వెంకటేశ్‌, పాల్గొన్నారు.

రైతుల ఆందోళనకు మద్దతు

వెల్దండ : రైతులు యూరియా కోసం సింగిల్‌విండో కార్యాలయం ఎదుట బారులు తీరారు. బీజేపీ మండల అధ్యక్షుడు కుర్మిద్ద యాదగిరి,పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు రైతులకు కావాల్సిన యూరియాను అందించాలని గురువారం బీజేపీ నాయకులు రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. ర్యాలీగా తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్‌ కార్తీక్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

Updated Date - Aug 28 , 2025 | 11:34 PM