Share News

kumaram bheem asifabad- దిందా పోడు రైతులకు అండగా ఉంటాం

ABN , Publish Date - Aug 13 , 2025 | 11:15 PM

మండలంలోని దిందా గ్రామానికి చెందిన సుమారు 20 మంది పోడు రైతులు దిందా గ్రామం నుంచి హైదరాబాద్‌ ప్రగతి భవన్‌కు సుమారు 400 కిలో మీటర్లు పాదయాత్రగా వెళ్తుండగా సిద్దిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్‌ వద్ద పాదయాత్రగా వెళ్తున్న చింతలమానేపల్లి మండలం దిందా పోడు రైతులను ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు పరామర్శించి దైర్యం చెప్పారు.

kumaram bheem asifabad- దిందా పోడు రైతులకు అండగా ఉంటాం
ప్రజ్ఞాపూర్‌ వద్ద దిందా పోడు రైతులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు

చింతలమానేపల్లి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దిందా గ్రామానికి చెందిన సుమారు 20 మంది పోడు రైతులు దిందా గ్రామం నుంచి హైదరాబాద్‌ ప్రగతి భవన్‌కు సుమారు 400 కిలో మీటర్లు పాదయాత్రగా వెళ్తుండగా సిద్దిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్‌ వద్ద పాదయాత్రగా వెళ్తున్న చింతలమానేపల్లి మండలం దిందా పోడు రైతులను ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు పరామర్శించి దైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 400 కిలో మీటర్లుకు పైగా పాదయాత్ర చేయడానికి సంకల్పించిన దిందా పోడు ఐతుల సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నామని తెలిపారు. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకుడు కొత్తపల్లి శ్రీనివాస్‌ సైతం పాదయాత్రగా వెళ్తున్న దిందా పోడు రైతులను ములుగు జిల్లాలో కలిసి ఆర్థిక సహయం అందజేశారు. పోడు రైతులకు న్యాయం చేయాలని 400 కిలోమీటర్ల దూరం నుంచి పాదయాత్రగా వెళ్తున్న వారిని ప్రభుత్వం గుర్తించాలని, వారికి న్యాయం చేయాలని కోరారు. కాగా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని హైదరాబాద్‌కు 400 కిలో మీటర్ల పాదయాత్ర చేస్తున్న దిందా గ్రామస్తులకు గజ్వేల్‌ నియోజక వర్గం ములుగు ప్రాంతంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా భూమి మాకే ఇవ్వాలని, పోడు పట్టాలిచ్చిన అటవీ అధికారుల అగడాల నుంచి రక్షణ కల్పించాలని, రైతు భరోసా, రైతు భీమా పంట రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కొంత దూరం వారితో నడిచి వెళ్లారు.

Updated Date - Aug 13 , 2025 | 11:15 PM