Share News

kumaram bheem asifabad- శ్రావణి కుటుంబానికి అండగా ఉంటాం

ABN , Publish Date - Nov 13 , 2025 | 10:09 PM

దహెగాం మండలం గెర్రె గ్రామంలో అక్టోబరు 18న హత్యకు గురైన శ్రావణి కుటుంబానికి అండగా ఉంటామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో గురువారం ఎస్పీ కాంతిలాల్‌ సుభాష్‌ పాటిల్‌, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీఎస్పీ వహిదుద్దీన్‌లతో కలిసి శ్రావణి కుటుంట సభ్యులకు ఇందిరమ్మ ఇల్లు, ఇంటి నిర్మాణానికి మహిళా సమాఖ్య నుంచి లక్ష రూపాయల రుణం చెక్కు, అట్రాసిటీ కేసు పరిహారం ఉత్తర్వులు, మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించే ఉత్తర్వులను అందజేశారు.

kumaram bheem asifabad- శ్రావణి కుటుంబానికి అండగా ఉంటాం
శ్రావణి కుటుంబసభ్యులకు ఉత్తర్వు కాపి అందజేస్తున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): దహెగాం మండలం గెర్రె గ్రామంలో అక్టోబరు 18న హత్యకు గురైన శ్రావణి కుటుంబానికి అండగా ఉంటామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో గురువారం ఎస్పీ కాంతిలాల్‌ సుభాష్‌ పాటిల్‌, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీఎస్పీ వహిదుద్దీన్‌లతో కలిసి శ్రావణి కుటుంట సభ్యులకు ఇందిరమ్మ ఇల్లు, ఇంటి నిర్మాణానికి మహిళా సమాఖ్య నుంచి లక్ష రూపాయల రుణం చెక్కు, అట్రాసిటీ కేసు పరిహారం ఉత్తర్వులు, మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించే ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హత్యకు గురైన శ్రావణి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. శ్రావణి తండ్రి చెన్నయ్య పేరిట ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేశామని అన్నారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి మండల సమాఖ్య నుంచి లక్ష రూపాయల రుణం చెక్కును అందిస్తున్నామని అన్నారు. మొదటి విడతగా రూ.4.12 లక్షలు మంజూరు ఉత్తర్వులను అందజేశామని తెలిపారు. శ్రావణి తండ్రి ఖాతాల్లో డబ్బులను జమ చేస్తామని అన్నారు. శ్రావణి కుటుంబానికి మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరులకు అందజేశామని తెలిపారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన వాటిని అందజేస్తున్నామని శ్రావణి తల్లిదండ్రులకు ఉపాధి నిమిత్తం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వ్యంలో ఏదైనా దుకాణం పెట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. శ్రావణి తుమ్మడిని గురుకుల పాఠశాలలో చేర్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ్ల ఎస్పీ మాట్లాడుతూ శ్రావణిని హత్య చేసిన వారికి కఠిన శిక్ష విఽధించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రక్షణ పరంగా శ్రావణి కుటుంబానికి పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పీడీ ప్రకాష్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, దహెగాం తహసీల్దార్‌ షరీఫ్‌, ఎంపీడీఓ నస్రుల్లా, ఎస్సై విక్రమ్‌, శ్రావణి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

అర్హులను గుర్తించాలి

ఆసిఫాబాద్‌, (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద ఎల్‌పీజీ గ్యాస్‌ లబ్ధిదారులను అర్హులను గుర్తించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లాలతో కలిసి ప్రధాన మంత్రి ఉజ్వల పథకంపై పౌరసరఫరాల శాఖాధికారులు, తహసీల్దార్‌లు, మున్సిపల్‌ కమిషనర్లు, రవాణా, వయవసాయ, మత్స్యశాఖాధికారులు, హిందుస్థాన్‌ పెట్రోలియం, భారత్‌ పెట్రోలియం ప్రతినిధులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద పేద వారికి ఉచితంగా ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్లను అందిస్తుందని అన్నారు. అర్హులైన వారిని గుర్తించడంలో సంబంధిత శాఖాధికారులు విస్తృతంగా అవగాహన పర్చాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళల సభ్యుల ద్వారా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఉజ్వల సిలిండర్‌ అనర్హుల చేతిలో ఉంటే సమగ్ర విచారణ జరిపి తొలగించాలని ఆదేశించారు. ఆదాయం, భూ విస్తీర్ణం, వాహనాలు కలిగిన యజమానుల వివరాలను సేకరించాలని సూచించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖాధికారి వసంతలక్ష్మి, రవాణా అధికారి రాంచందర్‌, వ్యవసాయాధికారి వెంకటి, మత్స్య శాఖాధికారి సాంబశివరావు, తహసీల్దార్‌లు, ఎంపీడీఓలు, హిందుస్థాన్‌, భారత్‌ పెట్రోలియం ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 10:09 PM