Share News

ప్రతీ సంఘానికి గౌరవం కల్పిస్తాం

ABN , Publish Date - Nov 05 , 2025 | 11:23 PM

నాగర్‌కర్నూల్‌ మండలం తూడుకుర్తి గ్రామంలో సగర సంఘం నూతన కమ్యూనిటీ హాల్‌ను ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌ రెడ్డి బుధవారం ప్రారంభించారు.

ప్రతీ సంఘానికి గౌరవం కల్పిస్తాం
తూడుకుర్తిలో సగర సంఘం భవనం శిలాఫలకాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి

- సగర సంఘం కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి

కందనూలు, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్‌ మండలం తూడుకుర్తి గ్రామంలో సగర సంఘం నూతన కమ్యూనిటీ హాల్‌ను ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఎమ్మెల్యేకు తూడుకుర్తి గ్రామ ప్ర జలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ ప్రతీ సంఘానికి గౌరవం, గు ర్తింపు, సదుపాయాలు కల్పించడం మా ప్రభుత్వ ధ్యేయమన్నారు. తూ డుకుర్తి గ్రామానికి ఈ కమ్యూనిటీ హాల్‌ ఒక శాశ్వతమైన అభివృద్ధికి గుర్తుగా ని లుస్తుందన్నారు. సంఘం సభ్యుల అభ్యున్నతికి పాటుపడతానని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్‌, జిల్లా అధ్యక్షుడు పోతుల శ్రీనివాసులు, గ్రామ సగర సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2025 | 11:23 PM