kumaram bheem asifabad- అట్రాసిటీ బాధితులకు భరోసా కల్పిస్తాం
ABN , Publish Date - Aug 05 , 2025 | 11:07 PM
అట్రాసిటీ బాదితులకు తక్షణమే నష్ట పరిహరం అందించి భరోసా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటే ష్ దోత్రే అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి నెలా 30వ తేదీన ప్రతి మండలంలోని ఒక గ్రామంలో పౌరహక్కుల దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామవని అన్నారు.
ఆసిఫాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): అట్రాసిటీ బాదితులకు తక్షణమే నష్ట పరిహరం అందించి భరోసా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటే ష్ దోత్రే అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి నెలా 30వ తేదీన ప్రతి మండలంలోని ఒక గ్రామంలో పౌరహక్కుల దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామవని అన్నారు. అట్రాసిటీ చట్టాలపై అవగహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం ఎస్పీ కాంతిలాల్ పాటిల్ మాట్లాడుతూ ఈ ఏడాది ఇప్పటివరకు 21 కేసులు నమోదయ్యాయని తెలిపారు. బాధితులకు నష్ట పరిహరం అందించి కేసులు నమోదైన వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుం టున్నామని చెప్పారు. అట్రాసిటీ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కేసులు నమోదైన వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వకూడదని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సమావే శంలో సబ్‌కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఏఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి సజీవన్, అట్రాసిటీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యను అందించాలి
ఆసిఫాబాద్, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మండలంలోని చిర్రకుంట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పాఠశాలలోని తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్‌లను పరిశీలించారు. విద్యార్థలకు కట్టెల పొయ్యిపై మధ్యాహ్న భోజనం వండడాన్ని గమనించారు. గ్యాస్ పైన వంట చేయాలని నిర్వహకులకు సూచించారు. ఏడో తరగతి గదిని సందర్శించి విద్యార్థులను గణితం సబ్జెక్టులో పలు ప్రశ్నలు అడగడంతో పాటు బోర్డు పై జవాబులు చేయించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి ఉదయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం వద్ద రక్షణ చర్యలు
ఆసిఫాబాద్, (ఆంధ్రజ్యోతి): ఎలకా్ట్రనిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన గోదాం వద్ద నిరంతరం పటిష్టమైన రక్షణ చర్యలు అమలు చేస్తున్నామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాం వద్ద రక్షణ చర్యలను మంగళవారం పరిశీలించారు. ఓటింగ్ యంత్రాల గోదాము వద్ద పోలిస్ బందోబస్తు ఏర్పాటు చేసి నిత్యం పహరా కాచేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గోదాము చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గట్టి నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు శ్యాంలాల్, ముసావీర్ హుస్సేన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.