Share News

అర్హులందరికీ ఇళ్లు ఇస్తాం

ABN , Publish Date - Jun 10 , 2025 | 11:26 PM

మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలి చానని, అర్హులందరికీ ఇందిర మ్మ ఇళ్లు అందజేస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచ కుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు.

అర్హులందరికీ ఇళ్లు ఇస్తాం
తిమ్మాజిపేటలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేస్తున్న ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి

- ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి

తిమ్మాజిపేట, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి) : మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలి చానని, అర్హులందరికీ ఇందిర మ్మ ఇళ్లు అందజేస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచ కుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. తి మ్మాజిపేట మండల కేంద్రం లోని జడ్పీహెచ్‌ఎస్‌ ఆవరణలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 561 మంది లబ్ధిదారులకు పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. గ్రామాల్లో మీ కుటుంబాలకు భద్రత కల్పిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎప్పుడూ మరువద్దని అన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లయ్యగౌడ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ మాధ వులు, కాంగ్రెస్‌ నాయకులు శ్రీనివాస్‌ బహుదూ ర్‌, దానం బాలరాజు, సురేందర్‌రెడ్డి, వివేక్‌రెడ్డి, ఉస్మాన్‌, లక్ష్మీనారాయణ, రవూఫ్‌, లింగం, నాగసాయిలు ఉన్నారు.

జిల్లా కేంద్రంలో మంజూరు పత్రాలు పంపిణీ

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : నియోజకవర్గంలోని అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు కట్టిం చేందుకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. లబ్ధిదారుల గృహ ప్రవేశానికి ఆహ్వానిస్తే కాంగ్రెస్‌ ప్రభు త్వం ఇచ్చే సన్న బియ్యంతో మీ ఇంట్లో భోజనా నికి వస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి వినోద్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 11:26 PM