భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం
ABN , Publish Date - Aug 13 , 2025 | 11:28 PM
జిల్లాలో ప్రముఖ క్షేత్రమైన మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చే భక్తుల కు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తు న్నామని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.
- ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
పదర, ఆగస్టు 13 (ఆంధ్రజ్యో తి) : జిల్లాలో ప్రముఖ క్షేత్రమైన మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చే భక్తుల కు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తు న్నామని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. పద ర మండలం మద్దిమడుగును సం దర్శించిన ఎమ్మెల్యే ఆలయంలో ప్ర త్యేక పూజలు నిర్వహించారు. గతం లో భక్తులు ఆలయ ప్రాంగణంలో మరుగు దొడ్లు, బాత్‌రూమ్‌ల సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే సులభ్ కాంప్లెక్స్ టాయిలెట్ల నిర్మాణం చేయిం చారు. వాటిని రిబ్బన్ కట్‌చేసి బుధవారం ఆయన ప్రారంభించారు. ఆలయ కమిటీ చైర్మ న్ రాములు నాయక్, కాంగ్రెస్ నాయకులు బాల్‌లింగం, చత్రూనాయక్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకుడి కుటుంబానికి పరామర్శ
వంగూరు : మండల కేంద్రానికి చెందిన కాం గ్రెస్ మైనార్టీ నాయకుడు షరీఫ్‌ఖాన్ (40) గురువారం అనారోగ్యంతో మృతి చెందాడు. స్థా నిక ఎమ్మెల్యే వంశీకృష్ణ గ్రామాన్ని సందర్శిం చారు. షరీఫ్‌ఖాన్ పార్థివదేహంపై పూలమాల వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు అల్వాల్‌రెడ్డి పాల్గొన్నారు.
తీజ్ వేడుకల కోసం ఎమ్మెల్యేకు ఆహ్వానం
చారకొండ : మండలంలోని గైరాన్ తండాలో గురువారం జరగనున్న తీజ్ వేడుకలకు హాజరు కావాలని ఎమ్మెల్యే వంశీకృష్ణను గిరిజన నాయ కులు బుధవారం అచ్చంపేటలో కలిసి ఆహ్వా నించారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ యూత్ వైస్ ప్రసిడెంట్ గోపీనాయక్, గ్రామ కమిటీ అధ్యక్షుడు హరినాయక్, రాంపాల్‌నాయక్, బాలునాయక్, నరేష్‌నాయక్, శివరాంనాయక్, శంకర్‌నాయక్, సేవ్యానాయక్, హనుమంతునాయక్ ఉన్నారు.