Share News

పంట సాగులో రైతులకు చేయూత అందిస్తాం

ABN , Publish Date - Jun 10 , 2025 | 11:55 PM

జిల్లాలో పంట సాగుల రైతులకు అవసరమైన సాగునీరు, పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు, ఇతర అన్ని విధాలుగా చేయూత అందిస్తామని క లెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు.

పంట సాగులో రైతులకు చేయూత అందిస్తాం

మంచిర్యాలకలెక్టరేట్‌, జూన్‌10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పంట సాగుల రైతులకు అవసరమైన సాగునీరు, పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు, ఇతర అన్ని విధాలుగా చేయూత అందిస్తామని క లెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం జి ల్లాలోని నస్పూర్‌లో గల సమీకృత జిల్లా కార్యాల యాల భవన సమావేశ మందిరంల మంచిర్యా ల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, జిల్లా వ్యవ సాయ అధికారి కల్పన, లీడ్‌ డిస్ర్టిక్‌ మేనేజర్‌ తి రుపతిలతో కలిసి మండల వ్యవసాయ అధికారు లు, మార్కేట్‌ కమిటీ ప్రతినిధులు, బ్యాంక్‌ అధి కారులు, ఫర్టిలైజర్‌ షాపుల యజమానులు, రైతు లతో వానాకాలం వ్యవసాయ సాగు సంసిద్దత స మావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వానాకాలంలో పంట సాగులో రై తులు అవసరమైన మెళకువలు అందిస్తామన్నారు. అర్హత గల ప్రతి రైతుకు అవకాశం ఉన్న ప్ర తి అంశంలో రాయితీ రుణాలు అందించేందుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. బ్యాంకర్లు సహకరిం చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ లక్షెట్టిపేట చైర్మన్‌ ప్రేమ్‌ చంద్‌, అగ్రికల్చర్‌ టెక్నాలజీ మేనేజ్‌ మెంట్‌ ఏజెన్సీ ప్రతి నిధి సింగతి మురళీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 11:55 PM