Share News

వైద్య విద్యార్థుల కు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం

ABN , Publish Date - Nov 21 , 2025 | 11:18 PM

ప్రభు త్వ వైద్య కళాశాలలో విద్య అభ్యసిస్తున్న వైద్య విద్యా ర్థులు చదువుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామ ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు.

వైద్య విద్యార్థుల కు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం

- పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు గడ్డం వంశీకృష్ణ

హాజీపూర్‌, నవంబరు 21(ఆంఽధ్రజ్యోతి) : ప్రభు త్వ వైద్య కళాశాలలో విద్య అభ్యసిస్తున్న వైద్య విద్యా ర్థులు చదువుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామ ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్ర వారం జిల్లాలోని హాజీపూర్‌ మండలం గుడిపేటలో గల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన వి ద్యార్థుల పరిచయ కార్యక్రమానికి కలెక్టర్‌ కుమార్‌ దీ పక్‌, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ సులేమా న్‌ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలో పూర్తిస్థాయి లో సౌకర్యాలు కల్పించి నిష్ణాతులైన అధ్యాపకుల ద్వా రా విద్య అందిస్తామన్నారు. విద్యార్థుల అవసరమేర కు ఎం.పి. లాండ్స్‌ నిధుల నుంచి బస్సు సర్వీసు క ల్పించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు క్రీడలకు సంబంధించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులు ఏకాగ్రతతో ఇష్టపడి చదివి మంచిర్యాల జిల్లా పేరును రాష్ట్రంలోనే కాకుండా జాతీయస్థాయిలో వినిపించాలని తెలిపారు. ఇటీవల కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి జల సంరక్షణ పురస్కారాలలో జిల్లాలో జాతీ యస్థాయిలో నిలబెట్టి కలెక్టర్‌ అవార్డు తీసుకోవడం అభినందనీయమన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభు త్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు తుది దశకు చేరు కున్నాయని, వైద్య విద్యార్థులకు అవసరమైన సదుపా యాలను సమకూర్చామని తెలిపారు. 32ఎకరాల వి స్తీర్ణంలో దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మాణం చేపట్టామని, వైద్య కళాశాలకు అనుబం ధంగా చేపట్టిన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు 2 నెలలలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా మని తెలిపారు. జిల్లాలో విద్య, వైద్య రంగాలపై ప్ర త్యేక దృష్టి సారిస్తామని, జిల్లాలోని లక్షెట్టిపేట, చె న్నూర్‌, బెల్లంపల్లి ప్రాంతాలలో సామాజిక ఆరోగ్య కేం ద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవ లు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సం బంధిత అధికారులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 11:18 PM