kumaram bheem asifabad-రైతులకు సరిపడా యూరియా అందజేస్తాం
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:24 PM
యాసంగి సీజన్‌లో రైతులకు సరిపడా యూరియా అందజేస్తామని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్‌లతో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రబి సీజన్‌కు సరిపడా యూరియా అందుబాటులో ఉందన్నారు.
ఆసిఫాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్‌లో రైతులకు సరిపడా యూరియా అందజేస్తామని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్‌లతో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రబి సీజన్‌కు సరిపడా యూరియా అందుబాటులో ఉందన్నారు. అవసరమైన రైతులకు అందించాలని తెలిపారు. యూరియా పక్కదారి పట్టకుండ అన్ని చర్యలు తీసుకొవాలని పంపిణీ కేంద్రాల వద్ద రద్దీ లేకుండా పర్యవేక్షించడంతో పాటు రైతులకు ఇబ్బందులు లేకుండా టెంటులు, తాగునీరు ఏర్పాటు చేయాలని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో రైతుల సౌకర్యం కోసం టోల్‌ఫ్రీ నంబరు 18005995770 ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ జిల్లాలో యాసంగి సీజన్‌లో సాగు చేసే పంటలకు సరిపడా 90వేల వరకు యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. 10,800 బస్తాల యూరియా ఉందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తివారి, డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, డీఏవో వెంకట్, మార్కెటింగ్ అధికారి అశ్వక్ ఆహ్మద్, ఉద్యానవన అదికారి నదీం, ఏడీఏ మిలింద్ పాల్గొన్నారు.
నిబంధనలు పాటించాలి
ఆసిఫాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని పీఎం శ్రీ ఉన్నత పాఠశాలల్లో నిర్వహించే కార్యక్రమాల్లో నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్, ఇన్‌చార్జీ డీఈవో దీపక్ తివారి అన్నారు. కలెక్టరేట్‌లో ఎంఈవోలు, హెచ్‌ఎంలతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సకాలంలో బిల్లులు ఖజనా కార్యాలయంలో సమర్పించాలన్నారు. పదో తరగతిలో ఫలితాల సాధన కోసం 100 శాతం ఉత్తీర్ణత సాదించేలా కృషి చేయాలని చెప్పారు.. ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, ఫైనాన్స్ అడిట్ అధికారి దేవాజీ, ఎంఈఓలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.