Share News

kumaram bheem asifabad-రైతులకు సరిపడా ఎరువులు అందిస్తాం

ABN , Publish Date - Jun 23 , 2025 | 11:22 PM

రైతులకు సరిపడా ఎరువులు అందించేందుకు కృషి చేస్తామని పీఏసీఎస్‌ చైర్మన్‌ పెంటయ్య అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సోమవారం రైతులకు ఎరువులు పంపిణీ చేశారు. వ్యవసాయాధికారుల సూచనల మేరకు ఎరువులు వాడాలని అన్నారు

kumaram bheem asifabad-రైతులకు సరిపడా ఎరువులు అందిస్తాం
వాంకిడిలో ఎరువులు పంపిణీ చేస్తున్న పీఏసీఎస్‌ చైర్మన్‌ పెంటయ్య

వాంకిడి, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): రైతులకు సరిపడా ఎరువులు అందించేందుకు కృషి చేస్తామని పీఏసీఎస్‌ చైర్మన్‌ పెంటయ్య అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సోమవారం రైతులకు ఎరువులు పంపిణీ చేశారు. వ్యవసాయాధికారుల సూచనల మేరకు ఎరువులు వాడాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు అజయ్‌కుమార్‌, తుకారాం, కమలాకర్‌, ఏవో గోపికాంత్‌, డైరెక్టర్‌లు దిగంబర్‌, సీతారాం, గొల్ల, టికాజీ తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(టి), జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని పీఏసీఎస్‌లో పోలీసుల బందో బస్తు మధ్య రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేశారు. యూరియా బస్తాల కోసం పెద్ద ఎత్తున రైతులు, మహిళలు తరలివచ్చారు. క్రమ వరుస పాటించకుండా గుమ్మిగూడి ఒకరిపై ఒకరు పడడం ఇబ్బందికరంగా మారడంతో విషయం తెలుసుకున్న ఎస్సై కమలాకర్‌ పంపిణీ కేంద్రం వద్దకు పోలీసులను పంపించారు. అందరికి పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నారు. సిబ్బంది ఎకరానికి ఒక్క బస్తా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఈవో రాకేష్‌, వ్యవసాయాధికారులు మాట్లాడుతూ ఎరువులు వస్తాయని రైతులు ఎవరు కూడా అధైర్యపడోద్దని సూచించారు.

జైనూర్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక మార్కెట్‌ గోదాంలో సోమవారం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌, సహకార చైర్మన్‌ కొడప హన్ను పటేల్‌, పలువురు నాయకులు కలిసి రైతులకు ఎరువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌ మాట్లాడుతూ జైనూర్‌ మండల రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే ఎరువులు ఇస్తున్నామని చెప్పారు. బస్తాకు రూ. 280 చొప్పున ధర మాత్రమే చెల్లించాలని సూచించారు. లింగాపూర్‌, సిర్పూర్‌(యు) మండలాల రైతులకు సిర్పూర్‌(యు)ని సహకార కేంద్రం ద్వార ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో సహకార సీఈవో సోనకాంబ్లే జనార్దన్‌, మాజీ ఎంపీపీ కొడప ధర్మారావ్‌, మార్కెట్‌ డైరెక్టర్‌ కనక గంగారాం, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2025 | 11:24 PM