Share News

హామీలు నెరవేర్చేవరకు ఉద్యమిస్తాం

ABN , Publish Date - Sep 03 , 2025 | 11:25 PM

మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పార్టీ వాటిని నెరవేర్చేవరకు ఉద్యమిస్తామని బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు.

హామీలు నెరవేర్చేవరకు ఉద్యమిస్తాం
వెల్దండ : కొట్రలో బీజేపీ దీక్షలో మాట్లాడుతున్న శిల్పారెడ్డి

- బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు ఆచారి

వెల్దండ, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పార్టీ వాటిని నెరవేర్చేవరకు ఉద్యమిస్తామని బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వెల్దండ, కొట్ర గ్రామాల్లో బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుకై నిరాహారదీక్ష నిర్వహించారు. కొట్రలో శిల్పారెడ్డి, వెల్దండలో ఆచారి పాల్గొని ప్రసంగించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా నేటికీ హామీలు అమలుచేయడంలో విఫలమైందని మండిపడ్డారు. ఆయా కార్యక్రమాలలో పార్టీ అధ్యక్షుడు కుర్మిద్ద యాదగిరి, నాయకులు గీతారాణి, బాలస్వామి, జంగయ్యయాదవ్‌, రామస్వామి, కృష్ణారెడ్డి, దేవేందర్‌, మట్ట విష్ణు, శశిధర్‌రెడ్డి, రాజుచారి, విజయలక్ష్మి, లాలూయాదవ్‌, శ్రీశైలం, సత్యనారాయణ, బలరాం, బాలయ్య ఉన్నారు.

బీటీ రోడ్డు కోసం పాదయాత్ర

ఊర్కొండ : హామీల అమలులో కాంగ్రెస్‌ వైఫల్యం చెం దిందని బీజేపీ నాయకుడు, కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల జనా ర్దన్‌రెడ్డి అన్నారు. మండలంలోని రాచాలపల్లి- మాదారంఎక్స్‌రోడ్డు వరకు బీటీ రోడ్డుగా మార్చా లని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, అరు గ్యారెంటీలు అమలు చే యాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం మాదారం గ్రామం నుంచి మండల కేంద్రం వరకు పాదయాత్ర నిర్వహించి తహ సీల్దార్‌ యూసుఫ్‌ అలీకి వినతి పత్రం సమర్పించారు. మండల కేంద్రంలోని నేతాజీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమావే శంలో జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి పాల్గొని మా ట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మండల అధ్యక్షుడు రాజేందర్‌ గౌడ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్‌ నాయకు లు దుర్గాప్ర సాద్‌, బొడనర్సింహ, శేఖర్‌రెడ్డి, రాంభూ పాల్‌రెడ్డి, బ్రహ్మచారి, పరశురాం, వెంక టేష్‌, కొమ్ము శ్రీను, గోపి, విజయ్‌యాదవ్‌ తది తరులు ఉన్నారు.

గ్రామాల్లో బీజేపీ నిరసన దీక్ష

కల్వకుర్తి : కల్వకుర్తి మండల పరిధిలోని ము కురాల, ఎల్లికట్ట తదితర గ్రామాల్లో బీజేపీ ఆధ్వ ర్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలుపర్చాలని బీజేపీ ఆధ్వ ర్యంలో ఒక్క రోజు దీక్ష నిర్వహించారు. కార్యక్ర మంలో ముకురాల దీక్షలో బీజేపీ జిల్లా నా యకుడు, గుండూరు మాజీ ఎంపీటీసీ నర్సిరెడ్డి, నాయకులు కృష్ణగౌడ్‌, అంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2025 | 11:25 PM