kumaram bheem asifabad- గురుకుల పాఠశాలను తరలిస్తే ఆందోళన చేస్తాం
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:24 PM
మండల కేంద్రంలోని 18 ఎకరాల విస్తీర్ణం లో ఉన్న గురుకులం పాఠశాలను వేరే చోటికి తరలిస్తే ఆందోళన చేపడుతామని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. గురుకులం పాఠశాలను మంగళవారం సందర్శించారు. అప్పటికే గేటుకు తాళం వేసి ఉండడంతో ప్రధాన గేటు వద్దనే మాట్లాడారు
సిర్పూర్(టి), అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని 18 ఎకరాల విస్తీర్ణం లో ఉన్న గురుకులం పాఠశాలను వేరే చోటికి తరలిస్తే ఆందోళన చేపడుతామని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. గురుకులం పాఠశాలను మంగళవారం సందర్శించారు. అప్పటికే గేటుకు తాళం వేసి ఉండడంతో ప్రధాన గేటు వద్దనే మాట్లాడారు. పాఠశాలలో కొన్ని గదులు బాగున్నాయని అన్నారు. వాటికి తోడు మరికొన్ని ప్రత్యామ్నాయ షెడ్లు ఏర్పాటు చేసినట్లయితే ఇక్కడే విద్యార్థుల కు విద్యాబోధన చేయవచ్చన్నారు. పాఠశాలను తరలిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర రీజినల్ కో ఆర్డినేటర్ అరుణకుమారితో మాట్లాడారు. పాఠశాలను సందర్శించి ఇక్కడే విద్యార్థులకు బోఽధించాలని కోరారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు పార్టీ బీ-ఫాం టికెట్లు ఎవరు ఇస్తారని విలేకరులు ప్రశ్నించగా పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు భీ-ఫాంలు అందజే స్తామని తెలిపారు. ఆయన వెంట నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.