రోడ్డు ప్రమాదాలను నివారిస్తాం..
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:17 PM
రోడ్డు ప్రమాద రహిత ప్రాంతం లక్ష్యంగా పోలీస్ శాఖ, అన్ని శాఖలను సమన్వయం చేసుకుని రోడ్డు ప్రమాదా లను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
- సురక్షిత ప్రయాణం అందించడానికి సిద్ధం
- సీపీ అంబర్ కిషోర్ ఝా
హాజీపూర్, నవంబరు 22(ఆంధ్రజ్యోతి) : రోడ్డు ప్రమాద రహిత ప్రాంతం లక్ష్యంగా పోలీస్ శాఖ, అన్ని శాఖలను సమన్వయం చేసుకుని రోడ్డు ప్రమాదా లను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. శనివారం ప్రమాదాల నివారణ చర్యలలో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ వేంప ల్లి -ముల్కల బ్రిడ్జి, గుడిపేట వద్ద ఉన్న బ్రిడ్జి, ఇతర ప్రాంతాలలో ఆర్‌బి శాఖ, ఎక్సైజ్, ఆర్టీవో, హైవే ఇంజనీర్ అధికారులు వీరితో పాటు గ్రామ రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యుల సమన్వయంతో కలిసి పర్యటించి గతంలో ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం వాటిల్లిన బ్లాక్ స్పాట్‌లను స్వయంగా పరిశీలించారు. ఆయా ప్రాం తాల్లో ప్రమాదాలకు గల సాంకేతిక కారణాలను విశ్లేషించి, తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే మద్యం సేవించి వాహనం నడపరాదని, చలికాలంలో మంచు వల్ల రోడ్డు స్పష్టంగా కనిపించకపోవడం కూడా ప్రమాదాలకు ఒక కారణమని దానికి తగిన విధం గా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సీఐ అశోక్ కుమార్, రోడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, మున్సిపల్ కమీషనర్ పాల్గొన్నారు.