Share News

kumaram bheem asifabad- సీతక్కపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం

ABN , Publish Date - Jul 01 , 2025 | 11:05 PM

కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండయిన సిర్పూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రావిశ్రీనివాస్‌ మంత్రి సీతక్కపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ కమిటీ రావిశ్రీనివాస్‌రావును పార్టీ నుంచి సస్పెండు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

kumaram bheem asifabad- సీతక్కపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం
మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, పాల్గొన్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

ఆసిఫాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండయిన సిర్పూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రావిశ్రీనివాస్‌ మంత్రి సీతక్కపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ కమిటీ రావిశ్రీనివాస్‌రావును పార్టీ నుంచి సస్పెండు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సిర్పూర్‌ నియోజకవర్గంలో రంగులు మార్చే ఊసవరెల్లిలా పార్టీలు మార్చిన శ్రీనివాస్‌కు కాంగ్రెస్‌ పార్టీ గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిందన్నారు. ఆదివాసీ మంత్రిని కించ పరిచేలా మాట్లాడటం ఆయన దురహంకారానికి నిదర్శమన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే కనీసం జడ్పీటీసీకి రావాల్సిన ఓట్లు కూడ తెచ్చుకొలేదని ఎద్దెవా చేశారు. అటువంటి వ్యక్తి మంత్రిని, ఎన్నికల్లో ఆదిలాబాద్‌ ఇన్‌చార్జిగా వ్యవహరించిన సత్తు మల్లేష్‌ను విమర్శించే అర్హత రావి శ్రీనివాస్‌కు లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు, జడ్పీ మాజీ ఛైర్మన్‌ సిడాం గణపతి, జైనూరు మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ విశ్వనాథ్‌ మాట్లాడుతూ . జైనూరులో గతంలో జరిగిన గొడవలకు మంత్రిని బాధ్యురాలిగా చేస్తూ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆదివాసీల తడఖా చూపుతామని హెచ్చరించారు. మంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన రావి శ్రీనివాస్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్‌, మాజీ మార్కెట్‌ చైర్మన్లు గాదవేణి మల్లేష్‌, మునీర్‌ ఆహ్మద్‌, ఆర్టీఏ సభ్యులు రమేష్‌, మాజీ జడీపటీసీ అత్రం లక్ష్మణ్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చరణ్‌, గుండా శ్యాం, వసంత్‌రావు, దత్తు, నారయణ, రఫు, గోపాల్‌నాయక్‌, గోవంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 01 , 2025 | 11:05 PM