Share News

రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదు

ABN , Publish Date - Aug 19 , 2025 | 10:44 PM

రైతులను వ్యాపారులు ఇబ్బందులు పెడితే సహించేది లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చత్రునాయక్‌ అ న్నారు. మంగళవారం లక్షెట్టిపేట పట్టణంలోని ఫర్టిలైజర్స్‌ అండ్‌ ఫెస్టిసైడ్స్‌ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలర్లు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కటిన చర్యలు తీసుకుంటామన్నారు.

రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదు
లక్షెట్టిపేట ఫర్టిలైజర్స్‌ గోదాంలను పరిశీలిస్తున్న వ్యవసాయ శాఖ అదికారులు

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చత్రునాయక్‌

లక్షెట్టిపేట, ఆగస్టు,19 (ఆంధ్రజ్యోతి): రైతులను వ్యాపారులు ఇబ్బందులు పెడితే సహించేది లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చత్రునాయక్‌ అ న్నారు. మంగళవారం లక్షెట్టిపేట పట్టణంలోని ఫర్టిలైజర్స్‌ అండ్‌ ఫెస్టిసైడ్స్‌ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలర్లు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కటిన చర్యలు తీసుకుంటామన్నారు. డీలర్లు తమ దగ్గర ఉన్న స్టాక్‌ వివరాలను నోటీసు బోర్డుపై ప్రతీ రోజు పెట్టాలని ఏరోజుకు ఆరోజు అప్‌డేట్‌ చేస్తు ఉండాలన్నా రు. రైతులు కూడా వాళ్ల అవసరాలకు మాత్రమే ఎరువులను తీసుకోవాలని ఒకే సారి ఎక్కువ మోతాదులో తీసుకుంటే మిగిలిన రైతులు ఇబ్బంది పడు తారన్న విషయం గమనించాలన్నారు. యూరియాను కూడా రైతులు అధిక మోతాదులో వాడితే పంటలకు చీలపీడలు వచ్చే ప్రమాదం ఉంటుందన్న విషయం గమనించాలన్నారు. ఇటిక్యాల, జెండవెంకటాపూర్‌, గుల్లకోట సహ కార సంఘాల ద్వారా ఇప్పటికే సుమారు 300టన్నుల యూరియాను పం పిణీ చేశామని అన్నారు. ఈతనిఖీల్లో సహాయ వ్యవసాయ సంచాలకులు గోపి, మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీకాంత్‌, ఉన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 10:44 PM