మహిళలను కోటీశ్వరులను చేస్తాం
ABN , Publish Date - Jul 23 , 2025 | 11:33 PM
రాష్ట్రంలో మహిళాసంక్షే మం, సాదికారత ఏకైక లక్ష్యంగా కోటి మం ది మహిళలను కోటీశ్వరులను చేయడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ప్రణాళిక బద్ధం గా పని చేస్తుందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనులశాఖ మంత్రి జి.వివేక్ వెంకట స్వామి తెలిపారు.
మంత్రి వివేక్‌వెంకటస్వామి
చెన్నూర్ నియోజకవర్గంలో 2వేలకుపైగా రేషన్‌కార్డుల పంపిణీ
మందమర్రిటౌన్/రూరల్ జూలై23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళాసంక్షే మం, సాదికారత ఏకైక లక్ష్యంగా కోటి మం ది మహిళలను కోటీశ్వరులను చేయడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ప్రణాళిక బద్ధం గా పని చేస్తుందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనులశాఖ మంత్రి జి.వివేక్ వెంకట స్వామి తెలిపారు. బుధవారం స్థానిక సా యిమిత్ర గార్డెన్‌లో నిర్వహించిన మహిళా శక్తి సంబురాలు నూతన రేషన్‌కార్డుల పం పిణీతో పాటు, కల్యాణలక్ష్మీ చెక్కుల పంపి ణీకి ఆయన ముఖ్యఅతిథిగా హాజ రయ్యా రు. మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్ర భుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వే స్తూనే రాష్ర్టాన్ని ప్రగతి పథంలో ముందు కు నడిపిస్తున్నారన్నారు. తాము అధికారం లోకి వచ్చిన 18 నెలల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామలన్నింటిని క్రమక్రమంగా నెరవే రుస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ని యోజకవర్గంలో 2 వేలకుపైగా కొత్త రేషన్ కార్డులు అందజేశామని తెలిపారు. 2వేల కోట్లతో మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణం చేపట్టామన్నారు. మందమర్రిలో స్వయం సహాయక సంఘాల ద్వారా పెట్రోల్ బంక్ నిర్వహణకు కృషి చేస్తామన్నారు. అ నంతరం 16 మందికి షాదిముబారక్ చెక్కులతో పాటు మహిళ సంఘాలకు 17.21 కోట్ల వడ్డీలేని రుణం చెక్కులను అందజే శారు. అంతకు ముందు మహిళలు బోనాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. క లెక్టర్ కుమార్ దీపక్‌తో పాటు జిల్లా అ దనపు కలెక్టర్ చంద్రయ్య, డీసీఎస్‌వో భద్రయ్య, పీడీ డీఆర్ డీఏ కిషన్, తహసీల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజ లింగు, క్యాతన్‌పల్లి మున్సిపల్ కమిషనర్ రాజు, మందమర్రి ఎంపీడీవో రాజేశ్వర్, జైపూర్ తహసీల్దార్ వనజారెడ్డి, ఇతర అధి కారులు పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు చేసిన మంత్రి
చెన్నూరు : చెన్నూరు పట్టణంలోని గడి మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం లో బుధవారం రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి మొ క్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆల య కమిటీ సభ్యులు మంత్రిని ఘనంగా శాలువాలతో సన్మానించారు. నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.