Share News

ప్రతీ వార్డును సుందరంగా తీర్చిదిద్దుతాం

ABN , Publish Date - Jun 02 , 2025 | 11:24 PM

బెల్లంపల్లి మున్సిపాలిటిలోని 34 వార్డులను సుందరంగా తీర్చిదిద్దుతామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీక్రిష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. సోమవారం పట్టణంలో ని పలు వార్డుల్లో ఒక కోటి 11లక్షల రూపాయల సీసీరోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ప్రారంభించి మాట్లాడారు.

ప్రతీ వార్డును సుందరంగా తీర్చిదిద్దుతాం

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీక్రిష్ణ

బెల్లంపల్లి, జూన్‌02(ఆంధ్రజ్యోతి): బెల్లంపల్లి మున్సిపాలిటిలోని 34 వార్డులను సుందరంగా తీర్చిదిద్దుతామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీక్రిష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. సోమవారం పట్టణంలో ని పలు వార్డుల్లో ఒక కోటి 11లక్షల రూపాయల సీసీరోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్‌ హయాంలో మున్సిపాలిటిల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయిస్తూ ప్రజా సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తోందన్నారు. ప్రతి వార్డులో సీసీ రోడ్డులు, డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తిచేసి సమస్య పరిష్కా రానికి కృషి చేయాలన్నారు. పట్టణంలో ఎటువంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకరావాలని నాయకులకు సూచించారు. గత ప్ర భుత్వ హయంలో అధ్వాన్నంగా మారిన రహదారులు, పారిశుధ్య నిర్వ హణ వంటి సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. అనంత రం పట్టణంలోని ఎఎంసీ ఏరియాలో గల స్వర్గీయ కాక వెంకట స్వామి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు ఆర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమనాయకుడిగా పేరుపొందిన కా కా వెంకటస్వామి అని కొనియాడారు. అనంతరం కాంగ్రెస్‌ సీనియ ర్‌ నాయకుడు అమ్జద్‌ ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో పరా మర్శించి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్ర మంలో నాయకులు కారుకూరి రాంచందర్‌, నెల్లి రమేశ్‌, బండి ప్రభాకర్‌, గెల్లి రాజలింగు, అప్సర్‌, దావ రమేశ్‌తో పాటు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 11:24 PM