సమష్టి కృషితో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:16 PM
సమష్టి కృషితో గ్రా మ పంచాయతీ ఎన్నికలు పకడ్బం దీగా నిర్వహిస్తామని కలెక్టర్ బదా వత్ సంతోష్ అన్నారు.
- కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : సమష్టి కృషితో గ్రా మ పంచాయతీ ఎన్నికలు పకడ్బం దీగా నిర్వహిస్తామని కలెక్టర్ బదా వత్ సంతోష్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలె క్టర్లు, ఎస్పీలతో స్థానిక సంస్థల ఎన్ని కలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌లు నాగర్‌క ర్నూల్ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజర య్యారు. కలెక్టర్ మాట్లాడుతూ నాగర్‌క ర్నూల్ జిల్లాలోని 20మండలాల పరిఽధిలో ఉన్న ఎంపీ టీసీ, జడ్పీటీసీ స్థానాలకు స్థానిక సంస్థల ఎన్ని కల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ ఈ సంద ర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వివరించా రు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ఓటరు జాబితా పక్కాగా నిర్వహించి ఎన్నికలను సజావుగా నిర్వహించేలా జిల్లాలో తీసుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్ట ర్ దేవ సహాయం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు, డిప్యూటీ సీఈవో గోపాల్ నాయక్ పాల్గొన్నారు.