తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తాం
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:13 PM
భీమిని మండలంలోని మా మిడిగూడ గ్రామంలో ‘భగీరథ ఉన్నా..చెలిమలే దిక్కు’ అనే అంశంపై ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీవో గంగా మోహన్, ఆర్‌డబ్యూఎస్ ఏఈ పోచన్నలు గురువారం గ్రామానికి వెళ్లి మిషన్ భగీరథ ట్యాంకు, పైపు లై న్లు ట్యాపులను స్వయంగా పరిశీలించారు.
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
భీమిని, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : భీమిని మండలంలోని మా మిడిగూడ గ్రామంలో ‘భగీరథ ఉన్నా..చెలిమలే దిక్కు’ అనే అంశంపై ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీవో గంగా మోహన్, ఆర్‌డబ్యూఎస్ ఏఈ పోచన్నలు గురువారం గ్రామానికి వెళ్లి మిషన్ భగీరథ ట్యాంకు, పైపు లై న్లు ట్యాపులను స్వయంగా పరిశీలించారు. అక్కడికి వచ్చిన స్థానిక ప్రజ లతో భగీరథ నీరు సరఫరాపై ఆరా తీసారు. తాగునీటి సమస్యలు తలెత్త కుండా చూస్తామని గ్రామస్థులు తెలియజేశారు. దీనికోసం అవసరమైన చిన్న చిన్న మరమ్మతులను గ్రామ పంచాయతీ సిబ్బందితో పూర్తి చేయిం చారు. మేజర్ రిపేర్లను రేపటితో పూర్తి చేయిస్తామని గ్రామస్థులకు తెలి పారు. గ్రామస్థులు అందరూ శుద్ధి చేయబడిన మిషన్ భగీరథ నీటిని మాత్రమే తాగాలని, చెలిమల లోని నీరు ఎవ్వరూ తాగవద్దని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ రాజు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.