సాగుకు అవసరమైన యూరియాను పంపిణీ చేస్తాం
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:03 PM
జిల్లాలో వ్యవసాయ సాగుకు అవసరమైన మేరకు యూరియా పంపిణీ చేస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం భీమారం మండల కేంద్రంలోని రైతు వే దికలో రైతులతో మాట్లాడారు. భీమారం మండలంలో గత సంవత్సరం 14 మెట్రిక్ టన్నుల యూరియా విని యోగించబడిందని, ఈ సంవత్సరం ఇప్పటికే 11 మెట్రి క్ టన్నుల యూరియా పంపిణీ చేశామని తెలిపారు.
భీమారం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో వ్యవసాయ సాగుకు అవసరమైన మేరకు యూరియా పంపిణీ చేస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం భీమారం మండల కేంద్రంలోని రైతు వే దికలో రైతులతో మాట్లాడారు. భీమారం మండలంలో గత సంవత్సరం 14 మెట్రిక్ టన్నుల యూరియా విని యోగించబడిందని, ఈ సంవత్సరం ఇప్పటికే 11 మెట్రి క్ టన్నుల యూరియా పంపిణీ చేశామని తెలిపారు. ఇంకా మండలంలో అవసరం ఉన్న ప్రకారం 3, 4 రోజు ల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, జిల్లా స హకార మార్కెటింగ్ సొసైటీల్లో యూరియా అందుబా టులో ఉంచుతామన్నారు. రైతులు ఆందోళన చెందాల్సి న అవసరం లేదన్నారు. అనంతరం భీమారంలో నిర్మి స్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను ప రిశీలించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రా రంభానికి సిద్దం చేయాలన్నారు. అనంతరం కేజీబీవీ విద్యాలయాన్ని సందర్శించారు. తరగ తి గదులు, రిజిష్టర్‌లు, వంటశాల, సామగ్రి భద్రరిచే గది, పరిసరాలను పరిశీలించారు. వి ద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం, శుద్ధ మైన నీటిని అందించాలన్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయులు పాఠాల ను బోధించాలన్నారు. వంట సిబ్బంది పరి శుభ్రత పాటించాలన్నారు. పాఠశాల పరిసరా ల్లో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేప ట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మం డల వ్యవసాయాధికారి అత్తె సుధాకర్, ఏఈవో అరుణ్‌కుమార్, ఎస్‌ఐ శ్వేత, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.