డబ్బులు చెల్లిస్తేనే లెప్రసీ సర్వే కొనసాగిస్తాం
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:14 PM
రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగంలో పని చేస్తున్న ఆశా వర్కర్లకు గతంలో నిర్వహించిన లెప్రసీ సర్వేకు డబ్బులు చెల్లించ కుండా మళ్లీ సర్వే నిర్వహించాలని అధికారులు ఒత్తిడి చేయడం సరైన నిర్ణయం కాదని డబ్బులు చెల్లిస్తేనే సర్వే కొన సాగిస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్య దర్శి ఆర్.శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు
కందనూలు, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగంలో పని చేస్తున్న ఆశా వర్కర్లకు గతంలో నిర్వహించిన లెప్రసీ సర్వేకు డబ్బులు చెల్లించ కుండా మళ్లీ సర్వే నిర్వహించాలని అధికారులు ఒత్తిడి చేయడం సరైన నిర్ణయం కాదని డబ్బులు చెల్లిస్తేనే సర్వే కొన సాగిస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్య దర్శి ఆర్.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. తెలం గాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవికుమార్‌కు పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడు తూ ఆశా వర్కర్లను వెట్టిచాకిరీ పేరుతో ఇబ్బం దులకు గురి చేయవద్దన్నారు. డబ్బులు చెల్లిస్తేనే సర్వే కొనసాగిస్తామని, లేదంటే సర్వే ను పూర్తిగా బహిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్య దర్శి పొదిల రామయ్య, ఆశా వర్కర్లయూనియ న్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జయమ్మ, కళావతి, రజిత, జిల్లా ఉపాధ్యక్షురాలు స్వప్న, కృష్ణవేణి, రత్నమాల, లక్ష్మి, శివలీల, అమీనా, శిరీష, ఉషమ్మ, శిరీష రోజా, భారతి, లక్ష్మీ, అమీన పాల్గొన్నారు.