kumaram bheem asifabad- మలి దశ ఉద్యమం చేపడుతాం
ABN , Publish Date - Aug 10 , 2025 | 11:09 PM
మాలి కులస్థులకు ఎస్టీ హోదా కల్పించేంత వరకు మలి దశ ఉద్యమం చేపడుతామని మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురే శ్యాంరావు అన్నారు. తిలక్‌నగర్‌లో జ్యోతిబాఫూలే భవనంలో మాలీ సంక్షేమ రాష్ట్ర, జిల్లా సంఘం నాయకులతో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాగజ్‌నగర్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): మాలి కులస్థులకు ఎస్టీ హోదా కల్పించేంత వరకు మలి దశ ఉద్యమం చేపడుతామని మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురే శ్యాంరావు అన్నారు. తిలక్‌నగర్‌లో జ్యోతిబాఫూలే భవనంలో మాలీ సంక్షేమ రాష్ట్ర, జిల్లా సంఘం నాయకులతో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాలి కులస్థులను ఎస్టీ జాబితాలో వెంటనే చేర్చాలన్నారు. గత ప్రభుత్వం 2022లో అసెంబ్లీ సాక్షిగా మాలీ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానం చేసినట్టు వివరించారు. కానీ కేంద్రం ఇంత వరకు ఈ సమస్యను పట్టించుకోవటం లేదన్నారు. ఈ విషయంలో ఎంపీలు స్పందించి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. లేని పక్షంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని అన్నారు. తమ సమస్యను పరిష్కరించుకుంటే త్వరలోనే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపడుతామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వసంత్ రావు, ఉపాధ్యక్షుడు నాందేవ్, కోశాధికారి మాధవి, హన్మంతు, కుమరం భీం జిల్లా అధ్యక్షుడు వాసు, ఉపాధ్యక్షులు గోపాల్, శ్రీనివాస్ పూలే సేవా సమితి అధ్యక్షుడు తిరుపతి, పోచయ్య, విజయ్ పాండురంగ్, శ్రీనివాస్, అర్జున్, నిరంజన్, తదితరులు పాల్గొన్నారు.